Samantha: బ్లూ డ్రెస్లో మెరిసిన సమంత.. లక్షల విలువైన నగలు ధరించిన సామ్.. ఎంతంటే..
మయోసైటిస్ చికిత్స అనంతరం ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన సామ్.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్, వాణిజ్య ప్రకటనలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. గత రెండు మూడు రోజుల క్రితం ది మార్వెల్ సినిమా ప్రమోషన్లలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆ తర్వాత ఇమ్యూనిటీ కోసం క్రయోథెరపీ అంటూ మరోసారి వార్తలలో నిలిచింది. -150 డిగ్రీల పొగలు కక్కే చలిలో సామ్ చికిత్స తీసుకుంటున్న ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. ఖుషి తర్వాత మరో ప్రాజెక్టు ఒప్పుకోలేదు. అంతేకాకుండా.. ఇన్నాళ్లు ఆమె విదేశాల్లో చికిత్స తీసుకుంది. మయోసైటిస్ చికిత్స అనంతరం ఇటీవలే ఇండియాకు తిరిగి వచ్చిన సామ్.. ఇప్పుడు సినిమా ప్రమోషన్స్, ఈవెంట్స్, వాణిజ్య ప్రకటనలలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. గత రెండు మూడు రోజుల క్రితం ది మార్వెల్ సినిమా ప్రమోషన్లలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ఆ తర్వాత ఇమ్యూనిటీ కోసం క్రయోథెరపీ అంటూ మరోసారి వార్తలలో నిలిచింది. -150 డిగ్రీల పొగలు కక్కే చలిలో సామ్ చికిత్స తీసుకుంటున్న ఫోటోస్ నెట్టింట వైరల్ కాగా.. ఆమె ఆత్మవిశ్వాసం, పట్టుదల చూసి ఆశ్చర్యపోయారు ఫ్యాన్స్. ఇక తాజాగా సమంతకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరలవుతుంది.
ప్రస్తుతం సామ్ తన ఇన్ స్టాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల బ్లూ ట్రెండీ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. డ్రెస్ కు తగినట్లుగా గులాబీ బంగారు లాకెట్, ట్రెండీ చోకర్ ధరించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే సామ్ మెడలో ధరించిన నగలు విలువ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీ ప్రకారం.. ఈ నగల ధర ట్యాగ్‌లు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సామ్ ధరించిన లాకెట్ విలువ రూ.6.12 లక్షలు కాగా, చోకర్ ధర రూ.53.19 లక్షలు. సమంత అలంకరించిన నగల మొత్తం ఖరీదు రూ. 59 లక్షలు! అని తెలుస్తోంది. దీంతో ఆ నగల తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
View this post on Instagram
View this post on Instagram
ఖుషి సినిమా తర్వాత దాదాపు ఆరు నెలలు విదేశాల్లో మయోసైటిస్ చికిత్స తీసుకుంది సామ్. అలాగే తన స్నేహితులతో బాలీ వెకేషన్ ఎంజాయ్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




