‘కొవిడ్ తర్వాత జ్వరాన్ని లైట్ తీసుకోవద్దు’ -‘ వెంకీ కుడుముల ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ నెటిజన్లకు కీలక సూచన చేశారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న, చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కరోనా– ఈ మహమ్మారి విజృంభన రోజులు గుర్తు చేసుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. అసలు రేపు అనేది ఉంటుందాం అని భయంతో బిక్కుబిక్కుమంటూ బ్రతికిన రోజులవి. ఒక మనిషి చచ్చిపోతే పట్టించుకునే దిక్కు కూడా లేదు. మానసికంగా, శారీరకంగా మనుషులు ఎంతగానో కుంగిపోయారు. వ్యాక్సిన్స్ రావడం, హెర్డ్ ఇమ్యూనిటీ కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి బయటపడగలిగాం. అయితే ఇప్పుడు సాధారణ జ్వరంగా మనం భావిస్తున్నాం కానీ అది కూడా కొవిడ్-19 అన్నది కొంతమంది నిపుణులు వెర్షన్. దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వచ్చే జ్వరాల్ని చాలామంది లైట్ తీసుకుంటున్నారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదంటున్నారు డైరెక్టర్ వెంకీ కుడుముల. తమ ఫ్యామిలిలో జరిగింది మరెవరికీ జరగకూడదని ఆయన ఎక్స్ లో భావోద్వేగ పోస్ట్ పెట్టారు.
‘‘గత కొన్ని వారాలుగా మా బంధువుకు తరుచుగా జ్వరం వస్తుంది. నార్మల్ ఫీవర్ అనుకుని సరైన సమయంలో డాక్టర్ వద్దకు వెళ్లి చికిత్స తీసుకోలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు దారి తీసింది. బీబీ సిండ్రోమ్ అంటే.. మనిషిలోని ఇమ్యూనిటీ పవర్ అదుపు తప్పి నరాలపై దాడి చేయమట. వ్యాధి తొలి దశలో ఉన్నప్పుడే చికిత్స అందించి ఉంటే, అది క్యూర్ అయ్యేది. డాక్టర్ వద్దకు వెళ్లకుండా లేట్ చేయడం వల్ల నిండు జీవితం ముగిసిపోయింది. మా కుటుంబానికి తీరని వేదన మిగిల్చింది. కరోనా తర్వాత జ్వరాన్ని కూడా లైట్ తీసుకోవద్దు. మన బాడీ సరైన స్థితిలో లేనప్పుడు తరచుగా జ్వరం బారిన పడతాం. ఇతర అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ లక్షణాలను అస్సలు అశ్రద్ద చేయొద్దు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను సంప్రదించండి. మనం తీసుకునే చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలే మన జీవితాల్ని నిలబెడతాయి’’ వెంకీ కుడుముల పోస్ట్‌లో రాసుకొచ్చారు.
#NotJustAFever 💔🙏🏻 pic.twitter.com/kuxuXr4V5L
— Venky Kudumula (@VenkyKudumula) November 7, 2023
‘ఛలో’, ‘భీష్మ’ వంటి సినిమాలతో తీయడంతో వెంకీ కుడములకు మంచి పేరు వచ్చింది. నితిన్ – రష్మిక కాంబోలో మరో సినిమాను ఆయన ఇటీవల అనౌన్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనంుది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
