Samantha: ‘ఊ అంటావా మావా’ పాటకు ముందుకు అనుకున్నది సమంతను కాదట.. ఛాన్స్ మిస్సైన బ్యూటీ ఎవరంటే..
ఇక ఈ సినిమాలోని ఊ అంటావా మావా.. ఊహు అంటావా పాట అయితే ఓ ఊపు ఊపేసింది. మత్తేక్కించే వాయిస్.. స్టార్ హీరోయిన్ సమంత ఎక్స్ప్రెషన్స్.. డ్యాన్స్ పాటను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ పాట అప్పట్లో సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. అయితే ఈ పాటకు ముందుగా అనుకున్న హీరోయిన్ సమంత కాదట.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జు్న్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా పుష్ప. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు బన్నీ. డైరెక్టర్ సుకుమార్ రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టడమే కాకుండా.. నార్త్ ఆడియన్స్కు తెగ నచ్చేసింది. ఇక ఈ సినిమాలోని పాటలకు వచ్చిన రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం పుష్ప చిత్రంలోని పాటలకు స్టెప్పులేశారు. ఇక ఈ సినిమాలోని ఊ అంటావా మావా.. ఊహు అంటావా పాట అయితే ఓ ఊపు ఊపేసింది. మత్తేక్కించే వాయిస్.. స్టార్ హీరోయిన్ సమంత ఎక్స్ప్రెషన్స్.. డ్యాన్స్ పాటను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ పాట అప్పట్లో సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. అయితే ఈ పాటకు ముందుగా అనుకున్న హీరోయిన్ సమంత కాదట.
ముందుగా ఈ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీని అనుకున్నారట మేకర్స్. తర్వాత బన్నీ సలహాతో ఈ ఛాన్స్ సమంతకు వచ్చిందట. మొత్తానికి ఈ పాటలో సమంత మరింత హైలెట్ అనే చెప్పుకోవాలి. ఇందులో ఆమె డాన్స్.. ఎక్స్ప్రెషన్స్ ఆకట్టుకున్నాయి. ఇక గతంలో వరుణ్ ధావన్ నటించిన లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది దిశా పటానీ. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్స్ అంతగా రాలేదు.




ప్రస్తుతం ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ప్రాజెక్ట్ కె చిత్రంలో కీలకపాత్రలో నటిస్తుంది. మరోవైపు బన్నీ.. పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో రష్మిక మందన్నా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.




