Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: మరో అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో ఆందోళన

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. మయోసైటిస్ బారిన పడడం, తరచూ చికిత్స కోసం విదేశాలకు వెళుతుండడంతో ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులే అయ్యింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది సామ్.

Samantha: మరో అనారోగ్య సమస్యతో బాధపడుతోన్న సమంత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఫ్యాన్స్‌లో ఆందోళన
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2025 | 10:16 AM

మయోసైటిస్ బారిన పడ్డ తర్వాత సినిమాలు బాగా తగ్గించేసింది సమంత. 2023లో రిలీజైన ఖుషి సినిమాలో చివరిగా కనిపించింది సామ్. ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై ఆమె కనిపించలేదు. గతేడాది వరుణ్ ధావన్ తో కలిసి సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో అభిమానుల ముందుకు వచ్చినా ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ మధ్యన ఒక సినిమాతో పాటు ఒక వెబ్ సిరీస్ ను ప్రకటించినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. దీంతో సామ్ అభిమానులు కాస్త నిరాశకు గురువుతున్నారు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది సమంత. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలనకు సంబంధించిన విషయాలను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇన్ స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టిన ఆమె జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న పిక్‌ను షేర్ చేసింది. ‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడం అనేది చాలా ఫన్‌గా ఉంటుంది’ అని రాసుకొచ్చింది. అలాగే ఈ పోస్టుకు సాడ్ ఎమోజీ కూడా జత చేసింది.

సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా సమంత నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. కేకే మీనన్, సికందర్ ఖేర్, సిమ్రాన్ బాగా, సకీమ్ సలీమ్, భువన్ అరోరా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే దర్శక ద్వయం ఈ సిటాడెల్ సిరీస్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

సమంత ఇన్ స్టా స్టోరీ పోస్ట్..

Samantha 1

Samantha 1

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్
బెట్టింగ్‌ ఎఫెక్ట్! యూట్యూబర్‌ హర్షసాయికి బిగ్ షాక్
అందం మైమరచిపోతుంది ఈ సొగసరి సోయగానికి.. డేజ్లింగ్ మీనాక్షి..
అందం మైమరచిపోతుంది ఈ సొగసరి సోయగానికి.. డేజ్లింగ్ మీనాక్షి..
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
దారుణం! టాప్ 10 లిస్టులో ఒక్క తెలుగు సినిమా లేదా?
'లేడీ లక్'తో ఐపీఎల్ 2025 బరిలోకి.. లిస్ట్ చాలా పెద్దదే భయ్యో
'లేడీ లక్'తో ఐపీఎల్ 2025 బరిలోకి.. లిస్ట్ చాలా పెద్దదే భయ్యో
సన్‌రూఫ్ కార్లంటే ఇష్టమా..? టాప్ ఫీచర్లు ఉన్న కార్లు ఇవే..!
సన్‌రూఫ్ కార్లంటే ఇష్టమా..? టాప్ ఫీచర్లు ఉన్న కార్లు ఇవే..!
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే
బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే
ఈ కోతి తెలివి తేటలు చూస్తే.. మీరు బిత్తరపోవాల్సిందే...
ఈ కోతి తెలివి తేటలు చూస్తే.. మీరు బిత్తరపోవాల్సిందే...
శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది.
శనీశ్వరుడి కటాక్షం. ఆ రాశులకు చెందిన ఉద్యోగులకు దిశ తిరగబోతోంది.
ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? పొరపాటున ఇలా
ఇంట్లో వాషింగ్‌ మెషిన్‌ ఏ దిక్కున పెట్టాలో తెలుసా..? పొరపాటున ఇలా
పవన్‌ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్
పవన్‌ కళ్యాణ్ పై బంగారం హీరోయిన్ క్రేజీ ట్వీట్