AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: పక్కా న్యూస్ వచ్చేసింది.. `పుష్ప`లో సమంత స్పెషల్ సాంగ్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ `పుష్ప` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.

Samantha: పక్కా న్యూస్ వచ్చేసింది.. `పుష్ప`లో సమంత స్పెషల్ సాంగ్.. ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే
Samantha
Ram Naramaneni
|

Updated on: Nov 14, 2021 | 2:08 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా మూవీ `పుష్ప` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.  రెండు భాగాలుగా ఈ మూవీ రానుంది. ఇప్పటికే తొలి భాగం  ‘పుష్ప ది రైజ్‌’  షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. పుష్ప సినిమా విడుదల తేదీ దగ్గర పడే కొద్ది చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్​లను వరుసగా ప్రకటిస్తూ ఫ్యాన్స్​లో జోష్​ నింపుతోంది మూవీ యూనిట్. డిసెంబర్ 17న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ క్రమంలోనే ఇప్పుడు మరో అదిరిపోయే అప్డేట్​ వచ్చేసింది. ముందునుంచీ అనుకుంటున్నట్లుగానే.. ఈ మూవీలో సమంత స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. ఇందుకు సంబంధించిన సమాచారం పక్కాగా వచ్చేసింది. అల్లు అర్జున్‌తో కలిసి సమంత స్టెప్పులతో అదరగొట్టనుంది. ఈ నెల 26 నుంచి నాలుగు రోజులపాటు పాట చిత్రీకరణ ఉంటుంది. దీంతో అటు బన్నీ ఫ్యాన్స్‌తో పాటు, ఇటు సామ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ మూవీలోని నాలుగో పాట ‘ఏయ్​ బిడ్డ​ ఇది నా అడ్డ’ను నవంబరు 19న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపుతూ ఓ కొత్త పోస్టర్​ను కూడా విడుదల చేసింది మూవీ టీమ్. ఇలా వరుస అప్‌డేట్స్‌తో ఫ్యాన్స్‌తో ఆనందంలో మునిగి తేలుతున్నారు.

భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కుతోన్న ‘పుష్ప’  మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇందులో ఐకాన్ స్టార్ బన్నీ పుష్పరాజ్‌ అనే ఎర్రచందనం స్మగ్లర్‌ పాత్రలో కనిపించనున్నారు. ఆయన ప్రేయసి శ్రీవల్లిగా రష్మిక కనిపించనుంది. విలన్‌గా మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు, గ్లింప్స్​ భారీగా అంచనాలు పెంచాయి.

Also Read: Gas Trouble: గ్యాస్ స‌మ‌స్యకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి.. హోమ్ రెమిడీస్

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు