Gas Trouble: గ్యాస్ సమస్యకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి.. హోమ్ రెమిడీస్
మారుతోన్న కాలానికి అనుగుణంగా ఆహార శైలికూడా మారుతోంది. ఇంటి ఫుడ్‌కు ప్రాధాన్యత తగ్గుతుండడం.. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు వంటి మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారా పదార్థాలు తీసుకోవడం ఇటీవల ఎక్కువై పోయింది. దీంతో చాలా మంది గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ ట్రబుల్ సమస్యకు చెక్ పెట్టడానికి కొన్ని సింపుల్ హోమ్ రెమిడీస్ ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Nov 14, 2021 | 1:31 PM

అయితే ఇంట్లో దొరికే పదార్థాలతోనూ గ్యాస్ సమస్య నుంచి బయటపడొచ్చనే విషయం మీకు తెలుసా? సహజసిద్ధంగా గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల గురించి ఓసారి చూద్దాం..

గ్యాస్ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం.. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడమే. కాబట్టి ఆహారం జీర్ణం కావడంలో కీలక పాత్ర పోషించే అల్లంను ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున రెండు టీస్పూన్ల అల్లం రసం సేవించాలి.

సోంపు గింజలను నేరుగా తీసుకోవడం కంటే.. వీటితో డికాషన్ చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

గ్యాస్ సమస్య తగ్గించడంలో కొబ్బరి నీరు కూడా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొబ్బరి నీళ్లలో ఉండే ప్రోటీన్లు గ్యాస్ సమస్యను తరిమి కొడతాయి

గ్యాస్ సమస్యకు చెక్ పెట్టడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. భోజనం తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమలాలి. ఇలా చేస్తే గ్యాస్ తగ్గుతుంది. రాత్రి జీలకర్ర నీటిలో నానబెట్టి.. పొద్దున్నే ఆ వాటర్ తాగినా కూడా ఉపశమనం ఉంటుంది

ఒత్తిడి, ఆందోళన కూడా గ్యాస్ సమస్యకు కారణంగా మారొచ్చు.. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే గ్యాస్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.





























