Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ విన్నర్‌గా గెలుస్తావని నమ్మకం ఉంది.. అతనికి మద్దతు తెలిపిన టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషలలో ఈ షోను ఆదరిస్తున్న ప్రేక్షకుల సంఖ్య ఎక్కువే. ఇప్పటి వరకు తెలుగులో నాలుగు సీజన్లు పూర్తిచేసుకున్న ఈషో.. ప్రస్తుతం ఐదవ సీజన్ కొనసాగుతుంది. ఇక బిగ్‌బాస్ సీజన్ 5 పదవ వారంలోకి అడుగుపెట్టింది. మొత్తం 19 మందితో ప్రారంభమైంది ఈ షో. ఇక ఇప్పటివరకు హౌస్ నుంచి సరయు, ప్రియా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హామిదా, లోబో, విశ్వ ఎలిమినేట్ కాగా.. ఈవారం అనారోగ్య సమస్యలతో జెస్సీ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ షోను అటు సినీ ప్రముఖులు సైతం వీక్షిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు తన మద్దతు ట్రాన్స్‌జెండర్ ప్రియాంకకు తెలపగా.. రియల్ హీరో సోనూ సూద్.. సింగర్ శ్రీరామచంద్రకు మద్దతు తెలిపారు..
తాజాగా బిగ్‌బాస్ షోపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. బిగ్‌బాస్ షోలో తన మద్దతు ఎవరికనేది తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో సజ్జనార్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్ ఇంట్లో శ్రీరామ్ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. పాటలు కూడా బాగా పాడుతున్నాడు. ఆయన కప్ గెలుస్తాడనే నమ్మకం ఉందంటూ చెప్పుకొచ్చారు. దీంతో శ్రీరామచంద్ర ఫాలోవర్స్ సజ్జనార్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇప్పటికే సోనూసూద్, సజ్జనార్ తమ మద్దతు శ్రీరామచంద్రకు తెలియజేయగా.. పాయల్ రాజ్ పుత్ సైతం తన సపోర్ట్ శ్రీరామ్ చంద్రకు అని చెప్పేసింది. అలాగే హిందీ కమెడియన్ భారతీ సింగ్ సైతం శ్రీరామచంద్రకు మద్దతు పలకడం విశేషం. ఇక ఇప్పటివరకు శ్రీరామచంద్రకు ఓటింగ్ పరంగా ఎలాంటి డేంజర్ జోన్ లేదు. ఈపరంగా చూసుకుంటే శ్రీరామచంద్ర సెమి ఫైనల్లో ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
ట్వీట్..
Honoured to receive blessings from IPS VC Sajjanar Sir. He created history nobody can forget! Thank you so much Real Superhero!! . . . #TeamSreeramaChandra #Sreeram #SreeramaChandra #SRC #biggboss5telugu #biggbosstelugu5 #GameChanger pic.twitter.com/hHyug07Nf2
— Sreerama Chandra (@Sreeram_singer) November 13, 2021
Also Read: Shilpa Shetty-Raj Kundra: మరో వివాదం.. శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులపై చీటింగ్ కేసు నమోదు