Pushpa: జోరు పెంచిన పుష్పరాజ్.. ఫ్యాన్స్‌కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. ఏయ్ బిడ్డా అంటూ ట్వీట్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. చాలా కాలం త్వరాత సుకుమార్,
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. చాలా కాలం త్వరాత సుకుమార్, బన్నీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక అభిమానుల అంచనాలకు తగినట్టుగానే పుష్ప నుంచి పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో బన్నీ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో గ్రామీణ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్నా శ్రీవల్లీ పాత్రలో నటిస్తుండగా.. మాలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ యూట్యూబ్‌లో రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో సాంగ్‌ను విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు చిత్రయూనిట్.. ఇందుకు సంబంధించి ట్విట్టర్లో బన్నీ పోస్టర్ విడుదల చేశారు. ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అనే పాటను నవంబర్ 19న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప మొదటి భాగాన్ని డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జె్ట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. జగపతి బాబు, సునీల్, అనసూయ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ట్వీట్..
Witness the MASS swag of #PushpaRaj ?#PushpaFourthSingle on 19th NOV ??#EyyBiddaIdhiNaaAdda #EyyBetaIdhuEnPatta #EyyPodaIthuNjaanaada #EyyMagaIdhuNanJaaga #EyyBiddaYeMeraAdda#PushpaTheRise #PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic pic.twitter.com/wdhPkqJqUo
— Mythri Movie Makers (@MythriOfficial) November 14, 2021
Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..
Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..