RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు.. అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాణ సంస్థ.. ట్వీట్ వైరల్..

Rajitha Chanti

Rajitha Chanti |

Updated on: Nov 14, 2021 | 11:35 AM

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు వచ్చిపడ్డాయి.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు.. అసంతృప్తి వ్యక్తం చేసిన నిర్మాణ సంస్థ.. ట్వీట్ వైరల్..
Rrr

అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‏తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్టు కష్టాలు వచ్చిపడ్డాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ అంసతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‏లో సినిమా టికెట్టు ధరలు తగ్గింపు నిర్ణయం తమ సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. .. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ కోర్టును ఆశ్రయించబోతుందని గత కొద్ది రోజులుగా నెట్టింట్లో వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. సినిమా టికెట్టు తగ్గింపు విషయంపై కోర్టును ఆశ్రయించమని.. ఏపీ సీఎం జగన్‏ను కలిసి పరిష్కరించుకుంటామని కాసేపటి క్రితం ట్వీట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల వ్యవహారం పెద్ద సినిమాల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మరీ ముఖ్యంగా సంక్రాంతి బరిలో దిగుతున్న పాన్ ఇండియా సినిమాలకు ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి నిర్మాతలకు నిద్రపట్టకుండా చేస్తోంది. తెలంగాణలో ఎక్స్‌ట్రా షోస్‌కు టికెట్‌ రేట్‌ పెంచుకునేందుకు అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అలాంటి వెసులుబాటు లేదు.

అందుకే సంక్రాంతిలో బిరలో రిలీజ్ అవుతున్న ట్రిపులార్ మూవీ టికెట్ రేట్ల విషయంలో కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉందన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. కానీ మాకు అలాంటి ఉద్దేశమే లేదంటూ క్లారిటీ ఇచ్చింది ట్రిపులార్ టీమ్‌. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్‌ల విషయంలో ఉన్న ఆంక్షల వల్ల తమ సినిమాకు ఇబ్బందే అన్న నిర్మాతలు… కోర్టుకు మాత్రం వెళ్లటం లేదని క్లారిటీ ఇచ్చారు.

త్వరలోనే సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి తమ సమస్యల గురించి వివరిస్తామని.. ప్రభుత్వం నుంచి సామరస్యపూర్వక సమాధానం వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన భారీ పీరియాడిక్ మూవీ ట్రిపులార్‌. 450 కోట్లతో నిర్మించాలనుకున్న ఈ సినిమా బడ్జెట్‌ కోవిడ్ కారణంగా మరింత పెరింగింది. దీంతో టికెట్ రేట్లు భారీగా పెంచితే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేదన్న టాక్ వినిపిస్తోంది.

‘‘ఏపీలో సినిమా టిక్కెట్‌ ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంపై న్యాయం కోరుతూ మేము లేదా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్‌ని కలిసి మా పరిస్థితిని తెలియజేసి సరైన పరిష్కారం కోరుతాం’’ అని ఆయన ఆదివారం ఉదయం ట్వీట్‌ చేశారు. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్‏తో ఆర్ఆర్ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‏టైన్మెంట్స్ నిర్మిస్తోంది.

ప్రస్తుతం నార్మల్‌ థియేటర్లలో 100 రూపాయల వరకు ఉన్న టికెట్‌ ధర,… మాల్టీప్లెక్స్‌లలో 250 వరకు ఉంది. కానీ ట్రిపులార్ బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం వారం రోజుల పాటు టికెట్‌ ధర 500 రూపాయల ఉండాలని అంచనా వేస్తున్నారు. మరి ఆ స్థాయిలో రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరిస్తుందా…? ఈ విషయంలోనే ఎటూ తేల్చుకోలేకపోతున్నారట మేకర్స్‌.

ట్వీట్..

Also Read: Jaggery Milk Benefits: పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్యలు ఖాతం.. ప్రయోజనాలను

తెలుసుకోండి..

IT Returns: మీరు పిల్లల చదువులకోసం తీసుకున్న రుణాల వడ్డీపై పన్ను మినహాయింపు పొందొచ్చు.. ఎలానో తెలుసుకోండి!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu