Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..

నెట్టింట సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ మాజీ హీరోయిన్ ఫోటో ట్రెండ్ అవుతోంది. అందులో ఆమెను ఎవరూ గుర్తించలేకపోతున్నారు.

Tollywood Heroine: ఈ నటి ఎవరో గుర్తుపట్టారా ? అప్పట్లో తెలుగునాట సెన్సేషన్..
Meenakshi Seshadri
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 14, 2021 | 11:34 AM

మీనాక్షి శేషాద్రి.. ఈ పేరు మీకు గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు టాలీవుడ్ లోని అగ్రహీరోలతో ఆడిపాడింది. వివాహానంతరం అమెరికాలో స్థిరపడింది. ఆమె అసలు పేరు శశికళ శేషాద్రి. ఈమె జార్ఖండ్ రాష్ట్రంలోని సింధిలో జన్మించింది. తమిళ కుటుంబానికి చెందిన ఈమె.. భరతనాట్యం, కూచిపూడి, కథక్, ఒడిసి లాంటి డాన్సులలో ప్రావీణ్యం గడించింది. ఢిల్లీలో చదువుకునే సమయంలోనే మిస్ ఇండియాలో పాల్గొని సెలక్ట్ అయ్యింది. ఇక ఈమెకు మోడల్ గా ఛాన్సస్ రావడంతో టాప్ మెడల్ గా పేరు తెచ్చుకుంది. అదే ఆమెను సినీ జీవితం వైపు నడిపించాయి. పెయింటర్ బాబుతో సినీ రంగ ప్రవేశం చేసిన మీనాక్షి,  హీరో సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ కొట్టి.. ఒక్కరోజులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, అనిల్ కపూర్, సన్ని డియోల్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగులోనూ చిరంజీవితో కలిసి నటించింది. అన్న ఎన్టీఆర్, బాలయ్య కలిసి నటించిన విశ్వామిత్ర సినిమాలో మేనక పాత్ర పోషించింది. అంతేకాదు మీనాక్షి1980-90లలో భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈమె అమెరికాలో కుటుంబంతో గడుపుతున్నారు. అక్కడ ఆమె ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యం నేర్పుతున్నారు.

కాగా మీనాక్షి శేషాద్రికి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో ఆమెను చూసిన నెటిజన్లు గుర్తించలేకపోతున్నారు. అప్పట్లో కుందనపు బొమ్మలా.. ముట్టుకుంటే కందిపోయేలా ఉండేది ఈ నటి. ఇప్పుడు ఆమెకు 57 సంవత్సరాలు. దీంతో వృద్దాప్య ఛాయలు కనిపిస్తున్నాయి. ఆమె ఎలా ఉన్నా ఎప్పటికే ఎప్పటికీ తమ ఫేవరెట్ హీరోయినే అంటున్నారు మీనాక్షి శేషాద్రి ఫ్యాన్స్.

Seshadri

Also Read: Viral Photo: ఈ ఫోటోలో పిల్లి ఎక్కడుందో గుర్తించండి.. అంత ఈజీ కాదండోయ్..

Olivia Morris: RRR బ్యూటీ ఒలివియా మోరిస్​ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు..