Olivia Morris: RRR బ్యూటీ ఒలివియా మోరిస్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు..
సౌత్ ఇండియా మోస్ట్ సక్సెప్‌ఫుల్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నుంచి నవంబరు 10న 'నాటు నాటు' సాంగ్ రిలీజయ్యింది. ఈ సాంగ్ సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సాంగ్‌లో కనిపించిన ఆమె.. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫిదా చేసింది. ఆమె అందానికి కుర్రకారు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఈ బ్యూటీ గురించిన విశేషాలు మీకోసం.
Updated on: Nov 14, 2021 | 11:07 AM

ఒలివియా మోరిస్ 1997లో లండన్‌లో జన్మించింది. చిన్నప్పటి నుంచి బామ్మ వద్దే పెరిగిన ఈ నటికి.. కళలు, థియేటర్, టీవీ, ఫిల్మ్ రంగాలంటే చాలా ఇంట్రస్ట్.

ఒలివియా స్కూలు స్థాయిలోనే ఆర్ట్-ఏ లెవల్లో ట్రైనింగ్ తీసుకుని మంచి పేరు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు కిడ్స్‌కు యాక్టింగ్‌లో మెళకువలు నేర్పించింది.

లండన్‌లోని 'రాయల్ వెల్ష్ మ్యూజిక్ అండ్ డ్రామా' కాలేజీలో గ్రాడ్యూవేషన్ కంప్లీట్ చేసింది. కాగా తనకు కేథరిన్ హెప్బర్న్ రోల్ మోడల్ అని.. ఆమెను చూసి బాగా స్ఫూర్తి పొందినట్లు పలుసార్లు చెప్పింది ఒలివియా.

ఆర్ఆర్ఆర్ మూవీతో ఈ బ్యూటీని భారత చిత్ర సీమకు పరిచయం చేయబోతున్నారు జక్కన్న రాజమౌళి. 'నాటునాటు' పాటతో ఒలీవియా మోరిస్ కూడా ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తోంది. ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్న అనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.




