AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..

తమిళ్ హీరో స్టార్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్స్

Suriya JaiBhim: మంత్రి చేసిన ఆరోపణలను ఖండించిన సూర్య.. జైభీమ్ గురించి ఆసక్తికర విషయాలు..
Suriya
Rajitha Chanti
|

Updated on: Nov 14, 2021 | 10:18 AM

Share

తమిళ్ హీరో స్టార్ సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నాడు. సూర్యకు తెలుగులోనూ ఫుల్ క్రేజ్ ఉంది. ఆయన నటించిన తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ అయి సూపర్ హీట్ అందుకున్నాయి. తాజాగా సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన జైభీమ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులోని సూర్య నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజనులపై జరుగుతున్న ఆకృత్యాలు..దాడులు.. అణచివేతకు బలైన కథలు.. న్యాయం కోసం పరితపించే ఆడబిడ్డ ఆత్మగౌరవం.. దైర్యంగా పోరాడితే న్యాయం తప్పక గెలుస్తుందని విశ్వసించే ఓ న్యాయవాది ఆత్మవిశ్వాసం ఇలా ఒక్కటేమిటీ ఎన్నో భావాలను కలగలిపినదే జైభీమ్ సినిమా. ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్‏లో విడుదలై సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఇందులో చంద్రు పాత్రలో జీవించాడు సూర్య.

అయితే విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ సినిమాలోని పలు అంశాలు ఓ వర్గం వారికి కించపరిచేలా ఉన్నాయని పీఎంకే ఎంపి అన్బుమణి రాందాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా సదరు ఎంపి ఆరోపణలను హీరో సూర్య ఖండించారు. ఎంపి అన్బుమణి రాందాస్ మాటలకు.. తనదైన శైలిలో బదులిచ్చారు. జైభీమ్ చిత్రాన్ని జడ్జి చంద్రూ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందనీ.. ఇందులో గతంలో జరిగిన అనేక వాస్తవిక అంశాలతోపాటు.. కొంత కల్పితంతో సినిమాను నిర్మించినట్టు తెలిపారు. ఇందులో వచ్చే ప్రతి సన్నివేశం.. ప్రతి పాత్ర ఏ ఒక్క వర్గానికో, వ్యక్తికో చెందినది కాదన్నారు. జైభీమ్ సినిమా చిరకాలం గుర్తుండిపోతుందని అన్నారు. ఇదిలా ఉంటే.. జైభీమ్ తర్వాత సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఎదర్కుం తుణిందవన్‌ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Olivia Morris: RRR బ్యూటీ ఒలివియా మోరిస్​ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు..

Kangana Ranaut: హైదరాబాద్‏లో కంగనా రనౌత్ పై కేసు నమోదు.. ఎందుకు చేశారంటే..

God Father: గాడ్ ఫాదర్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలకపాత్రలో..