God Father: గాడ్ ఫాదర్ కోసం రంగంలోకి బాలీవుడ్ స్టార్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కీలకపాత్రలో..
మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మాలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్
మెగాస్టార్ చిరంజీవి… ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న సినిమా గాడ్ ఫాదర్. మాలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ సినిమాకు ఇది రీమేక్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి లెటేస్ట్ అప్డేట్ ఒకటి ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం … మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తోంది. మలయాళంలోని లూసీఫర్ సినిమాలో పృథ్వీరాజ్ పోషించిన పాత్రలో తెలుగులో సల్మాన్ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మోహన్ లాల్ కు అండగా ఉండే ఆ పాత్ర కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాలో ఆ పాత్ర కీలకం. అంతేకాదు.. ఆ పాత్రకు ఓ పాట కూడా ఉంటుంది. ఈ పాత్ర కోసం గాడ్ ఫాదర్ చిత్రయూనిట్ ఇప్పటికే సల్మాన్ ను సంప్రదించారట. స్టోరీ నచ్చడంతో సల్మాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాను పూర్తిచేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కాజల్ హీరోయిన్‍గా నటిస్తుండగా.. పూజాహెగ్డే, రామ్ చరణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Also Read: Rashmika: వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..
Rashi Khanna: ఫ్లోరల్ చీరలో రాశీఖన్నా అందాలు.. మెస్మరైజ్ చేస్తున్న లేటెస్ట్ పిక్స్
Sonam Kapoor: భర్త ఒడిలో ఒదిగిన సోనమ్ కపూర్.. వైరల్ అవుతున్న పిక్స్