AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika: వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..

Rashmika: 'ఛలో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారి తనవైపు తిప్పుకుంది అందాల తార రష్మిక మందన్నా. రెండో చిత్రం 'గీత గోవిందం'తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక..

Rashmika: వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక..
Rashimka Mandanna
Narender Vaitla
|

Updated on: Nov 13, 2021 | 3:46 PM

Share

Rashmika: ‘ఛలో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ దృష్టిని ఒక్కసారి తనవైపు తిప్పుకుంది అందాల తార రష్మిక మందన్నా. రెండో చిత్రం ‘గీత గోవిందం’తో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిందీ బ్యూటీ. ఇక ఈ సినిమా తర్వాత రష్మిక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస విజయాలు, భారీ చిత్రాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసిందీ బ్యూటీ. ఇక ఈ అందాల తార బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టేసింది. తొలి సినిమాతోనే అమితాబ్‌ లాంటి బడా హీరో సినిమాలో నటించి బీటౌన్‌ ప్రేక్షకులను సైతం తనవైపు తిప్పుకుంది.

ప్రస్తుతం ముంబయిలో హంగామా చేస్తోన్న ఈ బ్యూటీ అక్కడ కూడా వరుస ఆఫర్లను సొంతం చేసుకుంది. దీంతో రష్మిక నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. బాలీవుడ్‌లో రష్మిక క్రేజ్‌ ఎంతలా పెరిగిందనడానికి ఆమె ఇస్తోన్న ఇంటర్వ్యూలే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రముఖ డేటింగ్‌ యాప్‌ ఒకటి నిర్వహించిన ‘స్వైప్‌ రైడ్‌’ అనే టాక్‌ షోలో రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘మీకంటే చిన్నవాడితో డేటింగ్‌ చేస్తారా.?’ అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ‘నా దృష్టిలో వయసు అనేది అసలు సమస్యే కాదు. ప్రేమకు వయస్సుతో సంబంధం ఏంటి.? వారు మమ్మల్ని మార్చేందుకు ప్రయత్నించకూడదు అంతే.. అప్పుడు వయసు పెద్ద విషయం కాదు’ అని తేల్చి చెప్పేసింది.

ఇక కొంత అబ్బాయిలు చొక్కాలు లేకుండా సోషల్‌ మీడియాలో ఫోటోలను పోస్ట్‌ చేయడంపై కూడా స్పందించిన రష్మిక.. ‘అబ్బాయిలు కష్టపడి ఫిట్‌గా కనిపించడానికి నేను అభినందిస్తున్నా. కానీ దాన్ని సోషల్‌ మీడియాలో ఎందుకు పోస్ట్‌ చేస్తున్నారు. మీ శరీరం కంటే మీరేంటో తెలియడం ముఖ్యం కదా’ అని బదులిచ్చిందీ చిన్నది. ఇక తాను స్కూలింగ్ వయసులో హాస్టల్‌, బోర్డింగ్ స్కూల్‌లో చదువుకున్నానని, ఇక డేటింగ్ చేసే అవకాశం ఎక్కడ ఉంటుందని చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే రష్మిక నటించిన పుష్ప చిత్రం వచ్చే నెల విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

Also Read: Corona Vaccine: దేశంలో పది నెలలుగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌.. ఇప్పటి వరకు ఎంత మంది టీకా తీసుకున్నారో తెలుసా..?

Cyber Fraud: ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డ ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి.. ఎస్‌బీఐ అధికారినంటూ ఫోన్‌ చేసి..

Nbk 107 Photos: వరుస సినిమాలతో జోష్ మీదున్న నటసింహం.. 107 వ సినిమాకు ముహూర్తం.. (ఫొటోస్)