Cyber Fraud: ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డ ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి.. ఎస్‌బీఐ అధికారినంటూ ఫోన్‌ చేసి..

Cyber Crime: ఆమె ఒక ఆర్బీఐ రిటైర్ట్ ఉద్యోగి.. ఆమె మొబైల్ నెంబర్‌కు ముందు ఓ మెస్సెజ్‌ వచ్చింది.. ఆ తర్వాత ఫోన్‌ చేసిన సైబర్‌ నేరస్థుడు తాను.. ఎస్‌బీఐ అధికారినని.. కేవైసీ అప్‌డేట్‌

Cyber Fraud: ఆన్‌లైన్ కేటుగాళ్ల ఉచ్చులో పడ్డ ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగి.. ఎస్‌బీఐ అధికారినంటూ ఫోన్‌ చేసి..
Cyber Crime
Follow us

|

Updated on: Nov 13, 2021 | 2:15 PM

Cyber Crime: ఆమె ఒక ఆర్బీఐ రిటైర్ట్ ఉద్యోగి.. ఆమె మొబైల్ నెంబర్‌కు ముందు ఓ మెస్సెజ్‌ వచ్చింది.. ఆ తర్వాత ఫోన్‌ చేసిన సైబర్‌ నేరస్థుడు తాను.. ఎస్‌బీఐ అధికారినని.. కేవైసీ అప్‌డేట్‌ చేయాలంటూ నమ్మబలికాడు. చివరకు ఆమె అకౌంట్లో ఉన్న రూ.3.38 లక్షలను కాజేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని థానేలో చోటుచేసుకుంది. సైబర్‌ మోసానికి థానేకు చెందిన ఆర్బీఐ రిటైర్ట్‌ ఉద్యోగి (70) మోసపోయినట్లు చితల్‌సర్‌ మాన్‌పాడ పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్‌ 8న సైబర్‌ నేరస్థులు.. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను పూరించమని కోరుతూ ఒక లింక్‌ను పంపారు. నో యువర్ కస్టమర్ (KYC) ఫారమ్‌ను అప్‌డేట్ చేయాలంటూ సందేశంలో రాశారు. అనంతరం ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 3.38 లక్షలు బదిలీ చేసుకున్నట్లు రైటైర్డ్‌ ఉద్యోగురాలు చితల్‌సర్‌ మాన్‌పాడ పోలీస్‌ స్టేషన్‌లో 11న ఫిర్యాదు చేసింది.

సైబర్‌ నేరస్థుడు తన నంబర్‌కు కాల్ చేసి.. ఎస్‌బీఐ అధికారి రాహుల్‌ అంటూ మాట్లాడడని పేర్కొంది. సీనియర్ సిటిజన్‌ల కోసం కేవైసీ ఆన్‌లైన్ అప్‌గ్రేడేషన్ సరికొత్త సేవను బ్యాంక్ ప్రారంభించిందని.. తాను పంపించిన లింకు ద్వారా వివరాలను పూరించాలంటూ ఆమె చెప్పాడు. అనంతరం ఆ మహిళ నేరస్థుడు ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి.. అందులో ఎస్‌బీఐ లోగో ఉన్న వెబ్ పేజీని సందర్శించింది. అయితే.. ఎస్‌బీఐ లోగో చూడగానే.. అతను ఎస్‌బీఐ బ్యాంకు నుంచే కాల్ చేస్తున్నట్లు నమ్మానని ఆ మహిళ పోలీసులకు తెలిపారు. అనంతరం తన వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు వెబ్ పేజీలో నమోదు చేశానని. నిమిషాల వ్యవధిలోనే ఆరు లావాదేవీలలో ఖాతా నుంచి రూ.3.38 లక్షలు బదిలీ అయినట్లు ఫిర్యాదు చేసింది.

ఆ తర్వాత తన కార్డును బ్లాక్ చేయడానికి బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేశానని.. అనంతరం బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేశానని తెలిపింది. కాగా.. బాధిత వృద్ధురాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) లో పనిచేస్తూ.. 2011లో పదవీ విరమణ చేసింది. తాను ప్రస్తుం పెన్షన్ మీద ఆధారపడి బతుకుతున్నానని, ఇప్పుడు ఆ డబ్బును సైబర్‌ నేరగాళ్లు దండుకున్నారని ఆవేదన వ్యక్తంచేసింది.

Also Read:

PM Narendra Modi: తెగ నచ్చేసింది.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చిన జ్ఞాపికకు ప్రధాని మోదీ ఫిదా..

Farmers Protest: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ట్రాక్టర్ ర్యాలీలో అరెస్టయిన రైతులకు పరిహారం..