Manipur Terror Attack: మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి.. కల్నల్ కుటుంబంతో సహా ఐదుగురు దుర్మరణం!
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో యూనిట్ కమాండర్‌తో సహా అతని కుటుంబసభ్యులు ఐదుగురు మరణించినట్లు భావిస్తున్నారు.
Manipur Terror Attack: మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. 46 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్‌పై శనివారం ఉగ్రవాదుల దాడి జరిగినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి . ఈ దాడిలో యూనిట్ కమాండర్‌తో సహా అతని కుటుంబసభ్యులు ఐదుగురు మరణించినట్లు భావిస్తున్నారు.
బెహియాంగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సియాల్సీ గ్రామ సమీపంలో ఈస్ట్‌మోజో అడపాదడపా కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని సమాచారం. అధికారిక నివేదికల ప్రకారం, 46 అస్సాం రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠి నవంబర్ 12, శుక్రవారం తన బెహియాంగ్ కోయ్ పోస్ట్‌ను సందర్శించి, రాత్రి అక్కడే బస చేశారు. శనివారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. బెహియాంగ్ పోలీస్ స్టేషన్‌కు 4 కిలోమీటర్ల దూరంలోని బెహియాంగ్ సమీపంలో శనివారం ఉదయం 10 గంటలకు ఆకస్మిక దాడి జరిగినట్లు మణిపూర్ పోలీసులు తెలిపారు. “కల్నల్ త్రిపాఠి బెహియాంగ్ నుండి తిరిగి వస్తుండగా, అతని వాహనం, ఎస్కార్ట్ వాహనాన్ని గుర్తు తెలియని అండర్‌గ్రౌండ్ మిలిటెంట్ గ్రూప్ మెరుపుదాడి చేసింది” అని మణిపూర్ పోలీసు ప్రతినిధి తెలిపారు.
ఆకస్మిక దాడిలో కల్నల్ త్రిపాఠి, అతని భార్య, వారి కుమారుడు, మరో ఇద్దరు జవాన్లు మరణించారని భద్రతా వర్గాలు తెలిపాయి. మరో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని బెహియాంగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. “AR బృందాలు ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని కూంబింగ్ చేస్తున్నాయి. OC బెహియాంగ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని తరలిస్తున్నారు” అని పోలీసులు వర్గాలు తెలిపాయి. కాగా, నిషేధిత మణిపురి తీవ్రవాద సంస్థ పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.