Turkish Politician Wife: వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. టైపో మిస్టేక్.. కొంపముంచిన అక్షర దోషం.. రాజకీయనేత భార్యకు జైలు శిక్ష ..
Turkish Politician Wife: ఒక్క చిన్న అక్షరం అర్ధాన్ని మారుస్తుందని తెలుసు... అయితే ఆ దేశంలో ఒక చిన్న టైపో మిస్టేక్ తో ఏకంగా ఓ మహిళ చేయని తప్పుకి ఇప్పుడు శిక్ష..
Turkish Politician Wife: ఒక్క చిన్న అక్షరం అర్ధాన్ని మారుస్తుందని తెలుసు… అయితే ఆ దేశంలో ఒక చిన్న టైపో మిస్టేక్ తో ఏకంగా ఓ మహిళ చేయని తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తుంది. అవును వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆమెపై రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. వివరాల్లోకి వెళితే.. టర్కీకి చెందిన టీచర్, రాజకీయ నాయకుడి భార్య బసక్ డెమిర్టాస్ 2015లో తీవ్రమైన అస్వస్థతకు గురయ్యింది. ఆ సమయంలో ఆమె గర్భవతిగా ఉంది. అనారోగ్యం ఫలితంగా డెమిర్టాస్‌కు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఐదు రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. అయితే డెమిర్టాస్ ఆస్పత్రిలో చేరింది 2015, డిసెంబర్ 11న కాగా.. ఆస్పత్రి సిబ్బంది డిసెంబర్ 14 అని రిపోర్టులో తప్పుగా టైప్ చేశారు. ఇది గమనించని డెమిర్టాస్.. వైద్యులు సూచించిన మేరకు ఐదు రోజులు సెలవు తీసుకుంది.
ఇక పెయిడ్ లీవ్ అప్లై చేస్తూ.. డాక్టర్లు ఇచ్చిన రిపోర్టును అందులో సబ్మిట్ చేసింది. అయితే దానిలో డెమిర్టాస్ డిసెంబర్ 14న ఆస్పత్రిలో చేర్చినట్లు ఉంది. ఈ క్రమంలో ఆమె తప్పుడు రిపోర్టులు సబ్మిట్ చేసి.. మోసం చేసిందనే ఆరోపణలపై డెమిర్టాస్ మీద పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కోర్టు 2018లో డెమిర్టాస్‌కు, ఆమెకు వైద్యం చేసిన డాక్టర్‌కి రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆసుపత్రి రికార్డు పుస్తకంలో డెమిర్టాస్ డిసెంబర్ 11న ఆస్పత్రిలో చేరినట్లు ఉంది. అక్షర దోషం వల్లే ఈ తప్పు జరిగిందని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు ఆస్పత్రి రికార్డు బుక్‌ను సాక్ష్యంగా చూడకుండానే శిక్ష విధించింది. ఇది కేవలం రాజకీయ కుట్రే అని భావిస్తున్నారు. ఈ తీర్పుపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
Az önce cezaevinde “cumhurbaşkanımız” ile görüştüm. Çok moralliydi, herkese selam söyledi. Bizim cumhurbaşkanımızın Ne yüzünde kibir var, Ne de gözlerinde kin. “Geçecek bugünler” dedi. “Her yere umut tohumları ekin.” pic.twitter.com/OzWg4bWo9T
— Başak Demirtaş (@Basak__Demirtas) November 12, 2021
Also Read: ఆ నగరంలో ఉద్యోగులకు జీతాలు రావాలన్నా, బస్సుల్లో ప్రయాణించాలన్నా వ్యాక్సిన్ తప్పనిసరి..