Corona Virus: ఆ నగరంలో ఉద్యోగులకు జీతాలు రావాలన్నా, బస్సుల్లో ప్రయాణించాలన్నా వ్యాక్సిన్ తప్పనిసరి..

Corona Virus: మన దేశం సెకండ్ వేవ్ ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తప్పలేదని.. జాగ్రత్తలు తప్పవని వైద్య సిబ్బంది హెచ్చరిస్తూనే..

Corona Virus: ఆ నగరంలో ఉద్యోగులకు జీతాలు రావాలన్నా, బస్సుల్లో ప్రయాణించాలన్నా వ్యాక్సిన్ తప్పనిసరి..
Covid Vaccine
Follow us

|

Updated on: Nov 13, 2021 | 3:56 PM

Corona Virus: మన దేశం సెకండ్ వేవ్ ఉధృతి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. అయితే కరోనా ముప్పు ఇంకా తప్పలేదని.. జాగ్రత్తలు తప్పవని వైద్య సిబ్బంది హెచ్చరిస్తూనే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ ను వేగవంతం చేసింది. టీకా ప్రతిఒక్కరూ తీసుకోవడం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అంతేకాదు వివిధ రాష్ట్రాల్లోని అధికారులు వ్యాక్సిన్ తీసుకోవడం కోసం డిఫరెంట్ కండిషన్స్ ను పెడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని థానే మున్సిపల్ అధికారులు కోవిడ్ 19 వ్యాక్సిన్‌ ఒక్క డోసు కూడా తీసుకొని వ్యక్తులను ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతించమని నగర మేయర్ నరేష్  తెలిపారు.  ఇప్పటికే థానే లో వ్యాక్సిన్‌లో ఒక్క డోస్ కూడా తీసుకోని తమ ఉద్యోగులకు జీతాలు చెల్లించమని థానే పౌర సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే.

నవంబర్ నెలాఖరుకి ఒక శాతం టీకా లక్ష్యాన్ని చేరుకోవడానికి, వివిధ చర్యలను తీసుకోవాల్సి వస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాదు ఇప్పటికే వ్యాక్సిన్ ఇంకా ఎవరు తీసుకోవాలి అనే విషయంపై ఇంటింటికీ సర్వేను టీఎంసీ ప్రారంభించింది. ఈ సర్వేలో టీకాలు వేసుకోలేదని గుర్తిస్తే.. వెంటనే పౌర సంఘం వారికి వెంటనే టీకాలు వేస్తారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణీకులు తాము వ్యాక్సిన్ వేయించుకున్నామని రుజువు తీసుకుని వెళ్ళాలి.

శుక్రవారం వరకు థానే జిల్లాలో 86,00,118 మందికి టీకాలు వేశారు. TMC అందించిన లెక్కల ప్రకారం, వారిలో మొత్తం 56,00,856 మంది మొదటి డోసుని తీసుకున్నారు. ఇక 29,99,262 మంది రెండవ డోసుని తీసుకున్నట్లు తెలుస్తోంది.   మరోవైపు కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో కోవిడ్ బాధితులకు చికిత్సనందిస్తున్న రెండు ఆస్పత్రులను మూసివేయడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Also Read:  రెగ్యులర్‌కి భిన్నంగా రుచికరమైన టిఫిన్.. సోయా ఉప్మా రెసిపీ.. ఎలా అంటే..