Soya Upma Recipe: రెగ్యులర్‌కి భిన్నంగా రుచికరమైన టిఫిన్.. సోయా ఉప్మా రెసిపీ.. ఎలా అంటే..

Soya Upma Recipe: రోజు తినే ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకనే సంపూర్ణ ఆహారం రోజూ మనం తీసుకోవాలి. శరీరంలోని కండరాల..

Soya Upma Recipe: రెగ్యులర్‌కి భిన్నంగా రుచికరమైన టిఫిన్.. సోయా ఉప్మా రెసిపీ.. ఎలా అంటే..
Soya Upma
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2021 | 3:30 PM

Soya Upma Recipe: రోజు తినే ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అందుకనే సంపూర్ణ ఆహారం రోజూ మనం తీసుకోవాలి. శరీరంలోని కండరాల అభివృద్ధికి ప్రొటీన్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకనే ప్రోటీన్లు ఇచ్చే ఆహారాన్ని తప్పకుండా రెగ్యులర్ గా తినే ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈరోజు రెగ్యులర్ టిఫిన్స్ కు భిన్నంగా ప్రోటీన్లు పుష్కలంగా ఉండే సోయా ఉప్మా తయారీ గురించి తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

సోయా గింజలు (4 కప్పులు) లేదా సోయా గింజల పొడి (మూడు కప్పులు) ఉల్లిపాయ (తరిగిన ముక్కలు) అల్లం (చిన్న చిన్న ముక్కలు ) పచ్చి మార్చి (పేస్ట్ ఆర్ చిన్న చిన్న ముక్కలు) క్యారెట్ (తురిమినది) బఠాణీలు (నానబెట్టినవి) క్యాబేజీ (తరిగినది ఒక కప్పు) కొత్తిమీర (చిన్న గా తగినది ఒక కట్ట) జీలకర్ర (ఒక టేబుల్ స్పూన్లు) మినప పప్పు (ఒక టేబుల్ స్పూన్లు) ఉసిరి పప్పు (ఒక టేబుల్ స్పూన్లు) జీడిపప్పు 10 నూనె సరిపడా ఉప్పు రుచికి సరిపడా

తయారీ విధానం: ముందుగా సోయా గింజలను లేదా సోయా బీన్ పౌడర్ ను వేడి నీటిలో 15 నుంచి 20 నిముషాల పాటు నానబెట్టుకోవాలి.  తర్వాత దానిని పిండి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద బాణలి పెట్టి.. నూనె వేసి వేడిచేసుకోవాలి. అందులో జీలకర్ర, మినపప్పు వేసుకుని వేయించుకుని తర్వాత అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కొంచెం సేపు వేయించాలి. అనంతరం కట్ చేసిన ఉల్లిపాయను వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ తరిగిన క్యాబేజీ, క్యారేట్ ను వేసుకుని స్విమ్ మీద పెట్టి వేయించుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసి చివరిగా పిండి పక్కకు పెట్టిన సోయా పౌడర్ ను   వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. కొంచెం సేపు ఉడికించాలి. స్టౌ మీద దింపే ముందు నిమ్మరసం పిండి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా ఉప్మా రెడీ. ఆరోగ్యానికి ఆరోగ్యం డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చే సోయా ఉప్మా ని అల్పాహారంగా పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.

Also Read:  బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈనెల 18న ఏపీ తీరాన్ని తాకే అవకాశం.. వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!