AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olive Oil Benefits: ఆలివ్ నూనె ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసా ?… అసలు విషయాలు తెలుసుకోండి..

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్నా.. పెద్ద అని కాకుండా.

Olive Oil Benefits: ఆలివ్ నూనె ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసా ?... అసలు విషయాలు తెలుసుకోండి..
Olive Oil
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2021 | 1:24 PM

Share

ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. చిన్నా.. పెద్ద అని కాకుండా.. ప్రతి ఒక్కరూ తీవ్రమైన వ్యాధుల భారీన పడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలు.. తీసుకునే ఆహారపదార్థాలు.. జీవనవిధానంలో మార్పులు. అయితే ముఖ్యంగా మనం ఉపయోగించే వంటనూనె వలన కూడా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆలివ్ నూనె ఆరోగ్యానికి మంచిదని అంటుంటారు. మరీ ఈ ఆయిల్ ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసుకుందామా.

మోడి నేచురల్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజర్ డైరెక్టర్ అక్షయ్ మోడీ.. మెడిటరేనియన్ డైట్‏లో భాగమైన ఆలివ్ ఆయిల్ ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైనదని వివరించారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే గుండె జబ్బులను తగ్గించడం.. మెరుగైన కంటి చూపు.. యాంటీ ఏజింగ్ స్కిన్ ప్రయోజనాలున్నాయి. ఆలివ్ నూనెతో ఆరోగ్యానికి బహుళ ప్రయోజనాలు మాత్రమే కాదు.. వంటల రుచిని పెంచడానికి కూడా సరైనదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో 0.3 శాతం ఆసిడిటి కంటే తక్కువ కోల్డ్ ప్రెస్ ఆలివ్ ఆయిల్ అని అంటున్నారు నిపుణులు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె జుట్టు.. చర్మ సమస్యలకు చికిత్స చేయడానికి సహాయపడుతుంది.

పొడి చర్మ సమస్యలను తగ్గించడానికి ఈ ఆయిల్ ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది పాలీఫెనాల్స్ యొక్క అధిక కంటెంట్‌ను కలిగి ఉంటుంది. అలాగే అంతర్గత కణాలను నయం చేయడంలోనూ సహాయపడుతుంది. అలాగే చర్మ బాహ్య పొరను దెబ్బతినకుండా చేస్తుంది. ఈ నూనెను జుట్టుకు ఉపయోగించినప్పుడు ఫోలికల్స్‏కు పోషణను అందిస్తుంది. అలాగే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మంచి కొవ్వులైన మోనోసాచురేటెడ్ కొవ్వులు ఈ నూనెలో ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‏ను తగ్గిస్తాయి. ఇది.. ఎముక, జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహయపడతాయి. అలాగే ఇందులో విటమిన్ ఇ, కె పుష్కలంగా ఉంటాయి.

Also Read: Balakrishna NBK 107: ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ NBK107.. డైరెక్టర్ ఎవరంటే.

Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?

Kangana Ranaut: కంగనా రనౌత్ నుంచి పద్మ శ్రీ వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి శివసేన డిమాండ్