AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwini Vaishnaw: కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి..

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్ సృష్టికర్తలతో ఆదాయాన్ని న్యాయంగా పంచుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. న్యూస్ సంస్థలు, డిజిటల్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, పరిశోధకులు.. ఎవరు అయినా ప్లాట్‌ఫారమ్‌లకు విలువ తీసుకువస్తున్న కంటెంట్ తయారు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Ashwini Vaishnaw:  కంటెంట్ క్రియేటర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి..
Ashwini Vaishnaw
Ram Naramaneni
|

Updated on: Feb 26, 2026 | 12:24 PM

Share

డిజిటల్ యుగంలో కంటెంట్ అంటే కరెన్సీ. రీల్ అయినా, న్యూస్ స్టోరీ అయినా, రీసెర్చ్ వీడియో అయినా.. ప్లాట్‌ఫామ్‌లకు ట్రాఫిక్ తెచ్చేది క్రియేటర్లే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా కంపెనీలు క్రియేటర్లతో ఆదాయం ఫెయిర్‌గా పంచుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. “కంటెంట్ క్రియేట్ చేస్తున్నవాళ్లకు సరైన వాటా దక్కాలి” ఆయన క్లియర్ స్టేట్మెంట్ పాస్ చేశారు. దూర గ్రామాల్లో కూర్చొని వీడియోలు చేసే యూట్యూబర్లు నుంచి, న్యూస్ సంస్థలు, సాంప్రదాయ మీడియా, గ్రౌండ్ రిపోర్టింగ్ చేసే జర్నలిస్టులు, క్లాసుల్లో బోధించిన లెక్చర్‌ను ఆన్‌లైన్‌లో షేర్ చేసే ప్రొఫెసర్లు వరకు అందరికీ ఫెయిర్ షేర్ ఉండాలని చెప్పారు. ప్రస్తుతం డిజిటల్ ఎకానమీ వేగంగా విస్తరిస్తున్న సమయంలో, కంటెంట్ సృష్టికర్తల హక్కులను రక్షించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థలు కేవలం వేదికలుగా కాకుండా భాగస్వాములుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికే అనేక దేశాల్లో సోషల్ మీడియా కంపెనీలు, వార్తా సంస్థల మధ్య ఆదాయ భాగస్వామ్యంపై చర్చలు జరుగుతున్నాయి. భారత్‌లో కూడా అదే దిశగా విధానపరమైన మార్పులు వస్తాయా అన్న ఆసక్తి నెలకొంది.

డిజిటల్ యుగంలో కంటెంట్‌కు ఉన్న విలువ పెరుగుతున్న నేపథ్యంలో, సృష్టికర్తలకు న్యాయం చేసే విధంగా కొత్త విధానాలు అమలులోకి వస్తాయా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్లాట్‌ఫామ్‌లు యాడ్స్ ద్వారా బిలియన్లు సంపాదిస్తున్నాయి. కానీ ఆ కంటెంట్ తయారు చేసినవాళ్లకు అందుతున్నది చాలా తక్కువ. ఈ గ్యాప్ తగ్గాల్సిన టైమ్ వచ్చిందని మంత్రి హింట్ ఇచ్చారు. సిస్టమ్ సెట్ రైట్ కావాలి అన్న ఆయన కామెంట్ డిజిటల్ వరల్డ్‌లో కొత్త డిబేట్ స్టార్ట్ చేసింది.

Follow Us