Balakrishna NBK 107: ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ NBK107.. డైరెక్టర్ ఎవరంటే.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో

Balakrishna NBK 107: ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ NBK107.. డైరెక్టర్ ఎవరంటే.
Nbk 107
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 12:25 PM

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమాను పూర్తిచేశారు బాలయ్య. ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక తర్వాత బాలకృష్ణ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్‏గా ప్రారంభించారు. బాలకృష్ణ కెరీర్‏లో 107వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం NBK107 అనే వర్కింగ్ టైటిల్‏తో నిర్మిస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది.

ఇక ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలలో దర్శకులు బోయపాటి శ్రీను.. వినాయక్.. హరీష్ శంకర్, కొరటాల శివ, బాబీ, బీవీఎస్ రవి, బుచ్చిబాబు సన, సాయి మాధవ్ బుర్రా, శ్రుతిహాసన్ హాజరయ్యారు. వివి వినాయక్ క్లాప్ కొట్టగా.. బోయపాటి శ్రీను కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ హరీష్ శంకర్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి.

ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటుతున్నాడు బాలకృష్ణ. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికపై బాలయ్య హోస్ట్‏గా అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో మొదటి ఎపిసోడ్ అతిథులుగా మంచు మోహన్ బాబు.. మంచు లక్ష్మి… విష్ణు విచ్చేయగా.. సెకండ్ గెస్ట్‏గా న్యాచరల్ స్టార్ నాని విచ్చేశారు.

Also Read: Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?

Radhe Shyam: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్.. అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చిన రాధేశ్యామ్ మేకర్స్..

Maalavika Sundar: తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకున్న ప్రముఖ సింగర్.. ఫోటోస్ వైరల్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?