AP Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈనెల 18న ఏపీ తీరాన్ని తాకే అవకాశం.. వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు

AP Weather Alert: ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3 .6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఒక ద్రోణి , ఉత్తర..

AP Weather Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఈనెల 18న ఏపీ తీరాన్ని తాకే అవకాశం.. వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు
మంగళవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచన
Follow us

|

Updated on: Nov 13, 2021 | 2:59 PM

AP Weather Alert: ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 3 .6 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఒక ద్రోణి , ఉత్తర అంతర్గత తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి గంగా పరివాహక ప్రాంత పశ్చిమ బెంగాల్ వరకు ఆంధ్ర , ఒడిశా మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. అంతేకాదు థాయిలాండ్ , దానిని అనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీద ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వలన, దక్షిణ అండమాన్ సముద్రం, థాయిలాండ్ తీరం మీద ఈ రోజు అల్ప పీడనం ఏర్పడింది.  ఈ అల్ప పీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తర అండమాన్ , దానిని ఆను కొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద వాయుగుండంగా..  నవంబర్ 1 5 వ తేదీ కల్లా బలపడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం కొనసాగించి.. మరింత బల పడి ఆంధ్ర ప్రదేశ్ తీరాన్నీ నవంబర్ 18 , 20 21 వ తేదీల్లో తాకే అవకాశం ఉందని తెలిపారు. దీంతో రాగాల మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ ఎలా ఉందనున్నదంటే..

ఉత్తర కోస్తా ఆంధ్రా, యానాం :  ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు , ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లవిస్తారంగా కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాల చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లవిస్తారంగా కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ: ఈరోజు ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల విస్తారంగా కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్లవిస్తారంగా కురిసే అవకాశం ఉంది.

Also Read:  కరోనా సమయంలో చేసిన వైద్య సేవలకు గాను తెలంగాణ డాక్టర్‌కు నేషనల్ యంగ్ లీడర్ అవార్డు..