Snake Hulchal: విశాఖ సింహాచలం ఆలయంలో పాము కలకలం.. దుకాణంలోకి దూరి హల్‌చల్..
విశాఖ సింహాచలంలోని వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం పాము కలకలం సృష్టించింది. ఆలయ ప్రాంగణంలోని ..
విశాఖ సింహాచలంలోని వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో శనివారం పాము కలకలం సృష్టించింది. ఆలయ ప్రాంగణంలోని పూజా సామగ్రి అమ్ముకునే ఓ దుకాణంలోకి దూరి హల్‌చల్ చేసింది. అక్కడి అల్మరాలో దాక్కొని కాసేపు షాపు యజమాని, స్థానిక భక్తులను భయపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న ఆలయ సిబ్బంది వెంటనే పాములు పట్టే ఉద్యోగి కిరణ్‌కు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అతడు చాకచక్యంగా పామును పట్టుకుని బంధించాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గతంలోనూ.. కాగా వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోకి పాములు చొరబడడం ఇదేమీ మొదటిసారి కాదు. ఈ ఏడాది మేలో కూడా ఇలాగే ఒక పాము ఆలయంలోకి ప్రవేశించింది. దేవస్థానంలోని వంటశాలలోకి దూరి భక్తులను భయపెట్టింది. ఆ సమయంలో్ ఆలయ అర్చకులు స్వయంగా పామును పట్టుకుని ఆలయానికి దూరంగా విడిచిపెట్టారు.
Also read:
Anantapur district: గొప్ప ఘనకార్యమే చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. గవ్వలతో
AP Weather: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ