Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: లోకేష్‌ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే రోజా.. ఓ రేంజ్‌లో ఇచ్చేశారుగా…

AP Politics - Roja: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న కామెంట్స్‌పై వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

AP Politics: లోకేష్‌ కామెంట్స్‌పై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే రోజా.. ఓ రేంజ్‌లో ఇచ్చేశారుగా...
MLA Roja (File Photo)
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 13, 2021 | 1:46 PM

AP Politics – Roja: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న కామెంట్స్‌పై వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆయన కామెంట్స్‌కు ఓ రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ‘‘పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని ప్రజలు తుంగలో తొక్కారు.. మునిసిపల్ ఎన్నికల్లో మురుగు కాలువల్లో ముంచి ముంచి తీశారు.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తరిమి తరిమి కొట్టారు.. అయినా వారికి సిగ్గు రాలేదు.’’ అంటూ టీడీపీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే రోజా. కుప్పంలో లోకేష్ మాట్లాడిన మాటలు, సవాళ్లు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. కుప్పంలోనూ చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకే ఇలాంటి సవాళ్లు విసురుతున్నారని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు కుప్పంలో ఇల్లు కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు.. ఏనాడు కుప్పం ప్రజలకు అందుబాటులో లేరని దుయ్యబట్టారు. కుప్పం ఎన్నికల్లో తుప్పును, పప్పును ప్రజలు తరిమి కొడతారంటూ ఘాటైన కామెంట్స్ చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ పాలనను చేరవేశారని ఎమ్మెల్యే రోజా కొనియాడారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ జగన్ రాకపోయినా వైసీపీని గెలిపిస్తున్నారని, ఆయనకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ లు వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారని రోజా నిప్పులు చెరిగారు. అధికారులపై దాడులకు పాల్పడడం, ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచి దౌర్జన్యాలకు దిగి వైసీపీ చేస్తోందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి కొడుకులు ఎన్ని ఆటలు ఆడినా కుప్పం ఎన్నికల తర్వాత రాసుకోవడానికి చరిత్ర.. చూసుకోవడానికి భవిష్యత్తు లోకేష్, చంద్రబాబులకు ఉండదంటూ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు.

Also read:

AP vs TS Politics: తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు ఇది మంచిది కాదు.. మంత్రి వెల్లంపల్లి సంచలన కామెంట్స్..

Startups News: వావ్.. వీళ్లు కదా అసలైన సైంటిస్టులు.. చదివేది 10వ తరగతి.. అస్కాంతంతో ‘వైఫై’ కనెక్షన్ ఇచ్చేశారు..!

India vs Pakistan: వారు అంగీకరిస్తేనే భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లు.. లేదంటే కష్టం.. మా చేతుల్లో ఏం లేదు: ఐసీసీ

వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వేసవిలో మెరిసే చర్మం కోసం నిమ్మ రసాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
వెండి నగలకు బంగారం ఇవ్వమన్న ఇద్దరు మహిళలు.. డౌట్ వచ్చి..
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
మనిషికి పంది లివర్ అమర్చిన డాక్టర్లు! ఎక్కడంటే..?
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
తగ్గేదేలే.. ఏపీలో ఉప ఎన్నికల పంచాయితీ.. 9 ప్రాంతాల్లో హోరీ హోరీ..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
క్యాబ్ ఖర్చుకే ఎయిర్ టాక్సీ.. జాలీ జాలీగా ఆకాశ ప్రయాణం..
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
అప్పట్లో ఇంటి అద్దె కట్టడానికి అమ్మానాన్న ఎన్నో ఇబ్బందులుపడ్డారు.
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
గుడ్‌న్యూస్‌.. కానిస్టేబుల్‌ పోస్టులకు ఎట్టకేలకు మోక్షం..!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
ఇండియా-ఏ తరఫున ఆడనున్న కోహ్లీ, రోహిత్‌ శర్మ!
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
అమ్మవారికి నైవేద్యంగా చిరుతిళ్ళు.. ఈ శక్తి పీఠం ఎక్కడ ఉందంటే
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్
రామ్ చరణ్‌కు వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్