Startups News: వావ్.. వీళ్లు కదా అసలైన సైంటిస్టులు.. చదివేది 10వ తరగతి.. అస్కాంతంతో ‘వైఫై’ కనెక్షన్ ఇచ్చేశారు..!
Magnet - WiFi: వాళ్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కానీ వాళ్లు చిన్నవయసులోనే అపారమైన మేదోశక్తిని పెంపొందించుకున్నారు. ఇది గుర్తించిన టీచర్లు.. ఆ మట్టిలో ఉండే మాణిక్యాలకు
Magnet – WiFi: వాళ్లు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కానీ వాళ్లు చిన్నవయసులోనే అపారమైన మేదోశక్తిని పెంపొందించుకున్నారు. ఇది గుర్తించిన టీచర్లు.. ఆ మట్టిలో ఉండే మాణిక్యాలకు కాస్త సాన బెట్టారు. ఇంకేముంది.. వారి అపార జ్ఞానంతో ఏకంగా అయస్కాంతం నుంచి వైఫై కనెక్షన్ సృష్టించి అందరినీ ఔరా అనిపించారు. ‘పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదు’ అన్న సూక్తిని ఒంటబట్టించుకుని భావి శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు.
వివరాల్లోకెళితే.. విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సాత్విక్, గణేష్, వేణు. జిల్లా పరిషత్ హైస్కూల్ లో పదవ తరగతి చదువుతున్నారు. వీరు అనునిత్యం ఏదో సృష్టించాలని, సాధించాలనే తపనతో ఉండేవారు. ఇదే సమయంలో ఫిజిక్స్ మాస్టారు రామకృష్ణ చెప్పిన పాఠం వారిలో ఉత్సాహాన్ని నింపింది. విద్యుదయస్కాంత తరంగాలతో అనేక రకాల ప్రయోగాలను చేయవచ్చనే పాఠాన్ని మాస్టారు బోధించారు. ఇదే సాత్విక్‌లో ప్రేరణ కలిగించింది. తనకు వచ్చిన ఆలోచనలను ఇతర స్నేహితులు గణేష్, వేణులతో పంచుకున్నాడు. ఈ ముగ్గురూ కలిసి పాఠశాలలోనే ప్రయోగాలు ప్రారంభించారు.
ప్రయోగాలు చేస్తూనే మాస్టారు సహకారాన్ని తీసుకున్నారు. ఓ అయస్కాంతం తీసుకుని తమ మెదడుకు పదును పెట్టారు. అయస్కాంతంలో ఉండే ధ్రువాలపై ప్రయోగాలు చేశారు. రేడియోలు, టేప్‌రికార్డుల్లో ఉండే స్పీకర్లకు ఉన్న అయస్కాంతంతో ఓ పట్టు పట్టి విద్యుదయస్కాంత తరంగాలతో సెల్‌ఫోన్‌కు వైఫై పనిచేసేలా ప్రయోగం చేశారు. ఛార్జర్ అడాప్టర్ వైపు ఉన్న ప్లస్, మైనస్‌లో తీగలను అయస్కాంతంపై ఉన్న రెండు బ్లేడ్లకు పెట్టిన తర్వాత ఛార్జింగ్‌ను సెల్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తే వెంటనే వైఫై కనెక్ట్ అవుతుందని అంటున్నారు ఈ విద్యార్థులు. విద్యుదయస్కాంత తరంగాలతో సెల్‌ఫోన్‌కు వైఫై పనిచేసేలా ప్రయోగం చేసిన ఈ భావి శాస్త్రవేత్తలను ఉపాధ్యాయులు అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే తమ స్థాయిలో విజయవంతమైన ప్రయోగం చేసి ఔరా అనిపిస్తున్న ఈ సర్కారీ పాఠశాల విద్యార్థులకు కాస్త ప్రోత్సహమిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Also read:
Relationship: వివాదాలు లేని జీవితం లేదు.. దంపతుల మధ్య గిల్లికజ్జాలు వస్తే ఇలా చేయండి..
Olive Oil Benefits: ఆలివ్ నూనె ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసా ?… అసలు విషయాలు తెలుసుకోండి..