Ketchup on Space: మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..

Ketchup on Space: అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కెచప్ తయారీలో సరికొత్త వెర్షన్‏ను సిద్ధం చేసింది. ఈ కెచప్‌ను అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల

Ketchup on Space: మార్స్ మట్టిలో పండే టమోటాల నుంచి కచప్ రెడీ.. ఇంట్రస్టింగ్ విశేషాలు మీకోసం..
Ketchup
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 13, 2021 | 9:50 AM

Ketchup on Space: అమెరికాకు చెందిన ప్రముఖ ఫుడ్ కంపెనీ హీంజ్ కెచప్ తయారీలో సరికొత్త వెర్షన్‏ను సిద్ధం చేసింది. ఈ కెచప్‌ను అంగారక గ్రహంపై ఉన్న మట్టిలో పెరిగిన టమోటాల నుంచి తయారు చేస్తారు. అంగారక గ్రహంపై మానవులు నివసించడానికి అనువుగా ఉన్న ప్రాంతాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. భూమిపై పండించినంత ఈజీగా కాదు అంగారక గ్రహంపై పంటలు పండించడం.

మార్స్ మట్టిని మార్టిన్ రెగిలిత్ అంటారు. అంగారక గ్రహం మట్టిలో సేంద్రియ పదార్థాల ఉనికి లేదు. సూర్యకాంతి కూడా అంగారకుడిపై తక్కువగా చేరుతుంది. అక్కడ టమోటాలను పండించేందుకు హీన్జ్‌ కొత్త పద్దతులను కనుగొంది. ఇందుకోసం హీన్జ్ కంపెనీలోని బృందం.. మార్స్ వంటి గ్రీన్ హౌస్ వాతావరణాన్ని సృష్టించింది. అందులో మార్స్ మట్టిని ఉపయోగించింది. చివరకు అందులో టమోటాలను పండించి వాటిని కెచప్‏గా మార్చింది.

ఈ కెచప్ రుచి సాధారణ వెర్షన్ కంటే భిన్నంగా ఉంటుందని తెలిపింది. హీన్జ్ మార్స్ వెర్షన్ కెచప్ బాటిళ్లను అంతరిక్షంలో పంపి మైనస్‌ 94 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉంచారు. ఆ తర్వాత దాన్ని తిరిగి భూమి పైకి తీసుకువచ్చారు. భవిష్యత్తులో అంగారక గ్రహానికి వెళ్లే సందర్శకులు అక్కడి మట్టిలో టమోటాలు పండించగలరో లేదో, పండించినా వాటితో కెచప్‌ తయారు చేయగలరో లేరో తెలుసుకోవడానికే ఈ మిషన్‌ను ప్రారంభించినట్టు హీన్జ్‌లోని టమోటా మాస్టర్స్ అంటున్నారు.

Also read:

Aadhaar: మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరికీ షేర్ చేయకండి.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవు..

Insurance Crime: రూ.23 కోట్ల బీమా డబ్బు కోసం రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు.. చివరకు సీన్‌ రివర్స్‌..

Hyderabad News: లేడీ కాదు పెద్ద కిలాడీ.. 2 కోట్ల అప్పు తీర్చేందుకు మాస్టర్ ప్లానే వేసింది.. అది తెలిసి పోలీసులు షాక్..