Whatsapp: మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానున్న వాట్సప్.. ఇకపై లాస్ట్ సీన్ అనుమతించిన వారికి మాత్రమే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సప్' తన యూజర్ల గోప్యతను కాపాడడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే..

ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘వాట్సప్’ తన యూజర్ల గోప్యతను కాపాడడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రొఫైల్ ప్రైవసీ సెట్టింగ్స్, ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్, పేమెంట్ వెరిఫికేషన్, బ్యాకప్ డేటా వంటి అధునాతన ఫీచర్లను మన ముందుకు తీసుకొచ్చింది. త్వరలో వాట్సప్ వినియోగదారుల గోప్యతకు సంబంధించి మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఇందులో భాగంగా వాట్సప్ స్టేటస్ మాదిరిగానే లాస్ట్‌సీన్‌కు కూడా మరో కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం లాస్ట్‌సీన్‌కు ఉన్న ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడీ ఆప్షన్లకు తోడుగా ‘ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ అనే ఆప్షన్‌ను జత చేయనుంది. ఈ సదుపాయంతో యూజర్లు అనుమతించిన వారు మాత్రమే లాస్ట్‌సీన్‌ని చూసే అవకాశం ఉంది.
గతంలో యూజర్ తన లాస్ట్‌సీన్‌ను ఎవరైనా చూడొచ్చనుకుంటే ‘ఎవ్రీవన్’, కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులు మాత్రమే చూడాలనుకుంటే ‘మై కాంటాక్ట్స్’, ఎవరూ చూడకూడదనుకుంటే ‘నోబడీ’ ఆప్షన్లను ఎంచుకునేవాళ్లు. అయితే నిర్ధిష్ట వ్యక్తి మన లాస్ట్ సీన్‌ను చూడకూడదనుకుంటే కొత్తగా వస్తోన్న ‘ మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్’ను ఎంచుకుని ఎవరైతే లాస్ట్ సీన్ చూడకూడదని కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరును సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ సదుపాయాన్ని త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సప్ బీటా ఇన్ఫో తెలిపింది. అదేవిధంగా ఇదే సదుపాయాన్ని ప్రొఫైల్ పిక్‌కు కూడా తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొంది..
Also Read:
Know This: చనిపోయిన వ్యక్తి వేలిముద్రలను ఎలా గుర్తిస్తారు..? వీడియో
Jio Book: మరో సంచలనం.. త్వరలోనే మార్కెట్లోకి జియో ల్యాప్‌టాప్‌లు.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?