కాబోయే అల్లుడిపై మామ ఫైర్.. తెలివిగా బౌల్ చేయడంలో విఫలం.. ఆ మూడు సిక్సులే పాక్ ఓటమికి కారణమంటూ విమర్శలు..!
T20 World Cup 2021: హసన్ అలీ క్యాచ్‌ను జారవిడిచినా.. 19వ ఓవర్‌లో తన పేస్‌ను తెలివిగా ఉపయోగించాల్సి ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు.
T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది తన పేస్‌ను తెలివిగా ఉపయోగించాల్సి ఉందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది అని అభిప్రాయపడ్డాడు. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గురువారం పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. షాహీన్ వేసిన ఓవర్‌లో వేడ్ మూడు సిక్సర్లు బాది ఆస్ట్రేలియాను ఫైనల్లో చేర్చాడు.
19వ ఓవర్‌లో హసన్ అలీ తొలి బంతిని క్యాచ్ పట్టుకోవడంలో ఆఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేసేందుకు షాహీన్ ప్రయత్నించి ఉండాల్సిందని షాహిద్ అఫ్రిది అన్నాడు. “షాహీన్ చివరి ఓవర్లో సంతోషంగా లేను. హసన్ అలీ క్యాచ్‌ను వదులుకున్నాడు. వరుసగా మూడు సిక్సర్లు కొట్టేలా బౌలింగ్ చేశాడు” అని షాహిద్ అఫ్రిది సమా టీవీ ఛానెల్‌లో అసహనం వ్యక్తం చేశాడు.
” షాహీన్ వద్ద పేస్ ఉపయోగించే అవకాశం ఉంది. కాని దానిని అతను తెలివిగా ఉపయోగించాల్సి ఉంది. క్యాచ్ జారవిడిచినప్పటికీ తరువాత మూడు బంతులను తన పేస్‌తో ఆఫ్ స్టంప్, ఫాస్ట్ యార్కర్‌లను బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాల్సి ఉంది” అని తెలిపాడు.
అయితే టోర్నమెంట్ ఈవెంట్ అంతటా షాహీన్ తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసలు కురిపించాడు. షాహీన్ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించాడు. నేను, వసీం భాయ్ (అక్రమ్), మహమ్మద్ అమీర్ కొత్త బంతితో ఇలా బౌలింగ్ చేయడం మాత్రమే చూశాను” అని షాహిద్ అఫ్రిది అన్నాడు.
“షాహీన్ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు. ఎంతో భవిష్యత్తు తనకు ఉంది. క్రికెట్‌లో ఎంతో నేర్చుకోవాల్సి ఉంది” అని పేర్కొన్నాడు.
గేమ్ విషయానికి వస్తే, షాదాబ్ ఖాన్ వేసిన వరుస ఓవర్లలో డేవిడ్ వార్నర్, మాక్స్‌వెల్ పెవిలియన్ చేరడంతో 177 పరుగుల ఛేదన దూరమైనట్లే కనిపించింది. అయితే స్టోయినిస్, వేడ్‌లు 7.4 ఓవర్లలో 81 పరుగులు చేయడంతో పాకిస్తాన్ ఆశలు కల్లలయ్యాయి. స్టోయినిస్ అద్భుంతంగా పునరాగమనం చేయగా, షాహీన్ షా అఫ్రిదిపై వరుసగా మూడు సిక్సర్లతో ఎక్కువ నష్టం కలిగించింది మాత్రం వేడ్.
అంతకుముందు, మొహమ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ హాఫ్ సెంచరీలతో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆదివారం జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా టీం న్యూజిలాండ్‌తో తలపడనుంది.