Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Relationship: వివాదాలు లేని జీవితం లేదు.. దంపతుల మధ్య గిల్లికజ్జాలు వస్తే ఇలా చేయండి..

ఇద్దరు వ్యక్తులు నివసించే చోట, మనస్సు.. ఆలోచనలో కొంత వైవిధ్యం ఉండాలి. ఇదే విషయం దంపతులకు కూడా వర్తిస్తుంది. అయితే ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న వివాదాలు రావడమే కాకుండా అవసరం కూడా అన్నది నిజం.

Relationship: వివాదాలు లేని జీవితం లేదు.. దంపతుల మధ్య గిల్లికజ్జాలు వస్తే ఇలా చేయండి..
Quarrels Between Wife And Husband
Follow us
KVD Varma

|

Updated on: Nov 13, 2021 | 1:26 PM

Relationship: ఇద్దరు వ్యక్తులు నివసించే చోట, మనస్సు.. ఆలోచనలో కొంత వైవిధ్యం ఉండాలి. ఇదే విషయం దంపతులకు కూడా వర్తిస్తుంది. అయితే ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న వివాదాలు రావడమే కాకుండా అవసరం కూడా అన్నది నిజం. అందులోనూ దంపతుల మధ్య వివాదాలు రావడం చాలా సహజం. ఎందుకంటే, కుటుంబ పరిస్థితులు.. ఆర్థిక అవసరాలు.. ఉద్యోగ బాధ్యతలు.. పిల్లల పెంపకం.. ఇలా చాలా రకాలైన బాధ్యతలు దంపతులపై ఉంటాయి. వాటిని తీర్చే క్రమంలో ఇరువురి మధ్య బేధాభిప్రాయాలు తలెత్తడం సహజం. ఇంకా చెప్పాలంటే భార్యా భర్తలకు ఇద్దరికీ సొంత కోర్కెలు ఉంటాయి. సహజమైన ఆలోచనలు ఉంటాయి. తమ జీవితం గురించి ఎవరికీ వారికి వారివైన అభిప్రాయాలూ ఉంటాయి. వీటి మధ్య బాధ్యతలు.. బరువులు మోయాల్సి రావడంలో వచ్చే ఇబ్బందుల నేపధ్యంలో ఇద్దరి మధ్యా తప్పనిసరిగా క్లాష్ వస్తుంది. ఇలా అందరికీ జరుగుతుంది. కానీ, ఇటువంటి వివాదాలు టీ కప్పులో తుపానులా తేలిపోవాలి. వాటిని నివురు గప్పిన నిప్పులా దాచేసి బయటకు మరోలా ఉండటం.. వాటిని పెద్దవిగా చేసుకుని ఒకరితో ఒకరు నిత్యం గొడవ పడటం రెండూ తప్పే అవుతుంది.

అప్పుడప్పుడు లేదా తరచూ తలెత్తే వివాదాలు ఒక పరిమితిలో ఉంటే మంచిది. తద్వారా అపార్థం కూడా పోయి సంబంధం మరింత బలపడుతుంది. దీని కోసం, కొన్ని విషయాలను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. వీటిని మనసులో ఉంచుకుని జీవిత భాగస్వామితో వివాదం తలెత్తినపుడు జాగ్రత్తగా వ్యవహరిస్తే సంసార బంధం సాఫీగా సాగిపోతుంది.

భాష పట్ల శ్రద్ధ వహించండి

నాలుకలో ఎముకలు ఉండవు అంటారు కానీ, ఈ చిన్న నాలుక పెద్ద గొడవలకు దారి తీస్తుంది. భాగస్వామితో ఏదైనా వివాదం వచ్చినప్పుడు, దానిని పరిష్కరించేటప్పుడు, అతని లేదా ఆమె భాష నియంత్రించాలి. లేకపోతే, వివాదాన్ని పరిష్కరించే బదులు, అది సంక్లిష్టంగా మారవచ్చు. ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న వ్యాఖ్యలు కూడా అగ్నికి ఆజ్యం పోస్తాయి. భాగస్వామికి ఏ అలవాటు నచ్చకపోతే ప్రేమతో చెప్పే ప్రయత్నం చేసి కలిసి పరిష్కారం వెతకాలి.

సంభాషణను కొనసాగించండి

చాలా సార్లు భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు, ఇద్దరూ ఒకరినొకరు తమ భాగస్వామి మాట్లాడటం ప్రారంభిస్తారని ఎవరికీ వారు ఎదురు చూస్తారు. లేదా మొండి పట్టుదలతో అవతలి వారే ముందు మాట్లాడాలి అని మౌనాన్ని ఆశ్రయించి మూతి బిగిస్తారు. అయితే ఇది పూర్తిగా తప్పు పధ్ధతి. అలాంటి సమయంలో, మీ అహాన్ని ఎప్పుడూ మీతో ఉంచుకోకండి, దానిని పక్కన పెట్టి మీ భాగస్వామితో మాట్లాడటానికి ప్రయత్నించండి. అవును, మీ భాగస్వామి ప్రారంభంలో మిమ్మల్ని విస్మరించవచ్చు.. కానీ, మీరు నిరంతర ప్రయత్నం చేస్తే, అది కచ్చితంగా మీ భాగస్వామికి మీపై ప్రేమను రెట్టింపు చేస్తుంది. భవిష్యత్తులో ఎపుడైనా అటువంటి పరిస్థితి వచ్చినపుడు మీ భాగస్వామి మిమ్మల్ని ముందుగా కచ్చితంగా పలకరిస్తారు.

ఆఫీస్ పనులంటే చిరాకు..

ఆఫీస్ పనిలో వచ్చిన కోపాన్ని ఇంటికి వచ్చి పార్ట్ నర్ పై బయటకు తీయడం చాలా సార్లు సహజంగా కనిపిస్తుంటుంది. కానీ, మరొకరిపై చికాకును ఇంటికి తీసుకోవడం సంబంధాన్ని పాడు చేయగలదని గుర్తుంచుకోండి. ఇంట్లో సంబంధాలు సురక్షితంగా ఉన్నాయని భావించే వ్యక్తులు ఇలా చేస్తారు, వారు తమకు కావలసినది చెప్పగలరు.

ద్వేషాన్ని వదలండి..

భార్యాభర్తలు తమ మనసులో పాత విషయాలను (ఒకప్పుడు చెడుగా భావించారు లేదా బాధపడ్డారు) ఉంచుకోవడం.. దాని గురించి వారి భాగస్వామితో మాట్లాడకపోవడం తరచుగా కనిపిస్తుంది. కానీ కాలక్రమేణా ఈ విషయాలు మరింత తీవ్రమవుతాయి. సాధారణ వాదన లేదా చికాకు ఉన్నప్పుడు, గొడవకు ఆజ్యం పోసే పాత విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ సమయంలో మీ మనసులో ఏముందో దాన్ని పరిష్కరించుకోండి. దానిని పట్టుకోవద్దు. పాత విషయాలను ఎటువంటి పరిస్థితిలోనూ చిన్న చిన్న వివాదాల సమయంలో బయటకు తీయవద్దు.

కుటుంబాన్ని మధ్యలోకి తీసుకురావద్దు

వివాదం ఉన్న విషయంపై మీ భాగస్వామితో మాట్లాడి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని ఏమీ చేయకండి. ఇలా మీరు అవతల వారి కుటుంబ సభ్యులను మీ గొడవల మధ్యలోకి తీసుకు రావడం సమస్యను పెంచుతుంది. ఎందుకంటే, ఎవరూ వారి కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఏమీ వినలేరు. కాబట్టి విషయం క్లిష్టంగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఇద్దరూ తమను తాము నియంత్రించుకోవాల్సి ఉంటుంది.

ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు. వీటిని మర్చిపోకుండా భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినపుడు దృష్టిలో ఉంచుకుంటే.. వివాదం ఆకాశంలో మబ్బులా తేలిపోతుంది. వివాదాలు అసలు రావు అనికానీ, రాకూడదు అని కానీ అనుకోవద్దు. వివాదాలు తలెత్తినపుడే మీకు అవతలి వారి మనసులో ఏముందో స్పష్టంగా అర్ధం అవుతుందనేది నిజం. వివాదాన్ని పరిష్కరించుకునే క్రమంలో అది మీకు అర్ధం అవుతుంది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి వచ్చినపుడు మీరు జాగ్రత్త పడతారు. దాంతో మళ్ళీ మళ్ళీ ఒకే వివాదం తలెత్తడం జరగదు.

చివరగా.. కలకాలం ఒకరికి ఒకరు తోడుగా సాగాల్సింది దాంపత్య జీవితం. దానిని తరచూ వివాదాలతో క్లిష్టం చేసుకోకుండా ఉండడం మంచిది. చిన్న చిన్న వివాదాలను వెంటనే పరిష్కరించుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది జీవిత భాగస్వాములు ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఎంత అవసరమో.. నమ్మకమూ.. గౌరవమూ కూడా అంతే అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకుంటే మీ దాంపత్య జీవితం చిరునవ్వుల నావలో సరదాగా సాగిపోతుంది.

ఇవి కూడా చదవండి: Zika Virus: పెరుగుతున్న జికా వైరస్ వ్యాప్తి.. గర్భిణీలు మరింత జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే..

Health with Ghee: మన ఆరోగ్యానికి ఏ నెయ్యి మంచిది? పసుపు నెయ్యి.. తెల్లని నెయ్యి మధ్య తేడాలేంటి?

CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్‌!