CBSE Exams: సీబీఎస్‌ఈ..ఐసీఎస్ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలి..సుప్రీంకోర్టులో పిటిషన్!
సీబీఎస్ఈ(CBSE), ఐసీఎస్ఈ(ICSE) టర్మ్-1 పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం, సీబీఎస్ఈ మైనర్ సబ్జెక్ట్ పరీక్షలు నవంబర్ 16 నుండి జరుగుతాయి.
CBSE Exams: సీబీఎస్‌ఈ(CBSE), ఐసీఎస్ఈ(ICSE) టర్మ్-1 పరీక్షలు దగ్గరలో ఉన్నాయి. ఈ పరీక్ష ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని ప్రకారం, సీబీఎస్ఈ మైనర్ సబ్జెక్ట్ పరీక్షలు నవంబర్ 16 నుండి జరుగుతాయి. ఇక ఐసీఎస్ఈ పరీక్షలు నవంబర్ 22 నుండి ప్రారంభమవుతాయి. మరోవైపు పరీక్షల విషయంలో గందరగోళం కొనసాగుతోంది. 10వ, 12వ తరగతి పరీక్షలను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈకి చెందిన ఆరుగురు విద్యార్థులు సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE, కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE), రెండూ 10,12వ తరగతి టర్మ్-12 పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలి
సీబీఎస్‌ఈ, సీఐఎస్‌సీఈ బోర్డు పరీక్షలపై విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించాలని పిటిషన్‌లో కోరారు. 2022 బోర్డు పరీక్షను హైబ్రిడ్ విధానంలో హాజరయ్యేలా ఆప్షన్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వాలని విద్యార్థులు సుప్రీంకోర్టును కోరారు. ఈ విషయమై పలువురు విద్యార్థులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. లైఫ్ ఇన్ డేంజర్ అని నైషా నవీన్ శ్రీవాస్తవ అనే విద్యార్థి ట్వీట్ చేసి రాశారు.
all the children’s life is in danger by the #CBSE and is not even thinking about their decision. there is already 1 positive case in our school in the offline class 10. CBSE has to revise its decision. Children want justice. LIFE IS IN DANGER!@PMOIndia #maketerm1online
— Naysha Navin Shrivastava (@NavinNaysha) November 12, 2021
కోవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది
మీడియా నివేదికల ప్రకారం, ప్రధాన సబ్జెక్టుల కోసం బోర్డు యొక్క 2022 తేదీ షీట్‌లోని పరీక్షలు మూడు వారాల పాటు నిరంతరం నిర్వహిస్తారనీ, కోవిడ్ -19 వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుందని పిటిషన్ దాఖలు చేసిన విద్యార్థులు భయపడుతున్నారు. ఇది కాకుండా, సామాజిక దూరాన్ని నిర్వహించడానికి ఆన్‌లైన్ పరీక్షలు కూడా అవసరం. అందుకే పరీక్షలను హైబ్రిడ్ విధానంలో నిర్వహించాలన్నది విద్యార్థుల డిమాండ్.
OMR షీట్ నమూనా
ప్రాక్టీస్ కోసం పాఠశాలలకు ఓఎంఆర్ (OMR) జవాబు పత్రం నమూనా ఇప్పటికే విద్యార్ధులకు పంపించాయి బోర్డులు. సీబీఎస్‌ఈ10వ తరగతి, 12వ టర్మ్ 1 పరీక్షకు కొన్ని రోజుల ముందు, ప్రాక్టీస్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పాఠశాలలకు నమూనా ఓఎంఆర్ సమాధాన పత్రాన్ని పంపింది. సీబీఎస్‌ఈ(CBSE) ఇప్పటికే 10వ తరగతి, 12వ బోర్డ్ ఎగ్జామ్ 2022 టర్మ్ 1 కోసం డేట్‌షీట్‌ను విడుదల చేసింది. నవంబర్ 16, 17 తేదీల్లో 12, 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సీబీఎస్‌ఈ(CBSE) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, OMR షీట్ పూరించడానికి విద్యార్థులు నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ను మాత్రమే ఉపయోగించగలరు.
మేజర్ సబ్జెక్ట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు
సుమారు నెల రోజుల క్రితం, సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి టర్మ్-1 కు సంబంధించిన 22 ప్రధాన సబ్జెక్ట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. 10వ తరగతి పరీక్ష నవంబర్ 30 నుంచి డిసెంబర్ 11 వరకు, 12వ పరీక్ష డిసెంబర్ 1 నుంచి 22 వరకు జరగనుంది. మైనర్ సబ్జెక్టుల పరీక్షకు సంబంధించిన డేట్‌షీట్‌ను బోర్డు అన్ని పాఠశాలలకు విడిగా పంపిందని బోర్డు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్.సన్యం భరద్వాజ్ తెలిపారు. 12వ మైనర్ సబ్జెక్టుల పరీక్ష నవంబర్ 16 నుంచి, 10వ తేదీ నవంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది.
సీబీఎస్‌ఈ(CBSE) మొదటి టర్మ్ పరీక్షలో స్వీయ కేంద్రాలను కలిగి ఉంటుందా లేదా ఇతర కేంద్రాలను తయారు చేయాలనేది కొద్ది రోజుల్లో నిర్ణయిస్తారు. పాఠశాలలతో సమావేశమై దీనిపై నిర్ణయం తీసుకుంటామని పరీక్షల సమన్వయకర్త తెలిపారు.
ఇవి కూడా చదవండి: Gold Purchase: బంగారం కొంటున్నారా? మీరు కొంటున్న పసిడి నిజమైనదో నకిలీదో సులువుగా గుర్తించండి ఇలా!
Price Hike: కిరాణా..బట్టలు..ఎలక్ట్రానిక్స్..అన్ని వస్తువుల ధరలూ పెరగనున్నాయి.. ఎందుకో తెలుసా..