China Vaccine: ప్రాణాలు తీస్తున్న చైనా వ్యాక్సిన్.. రెండు డోసుల తర్వాతా కరోనా సోకి ఎంతమంది మరణించారంటే..

మలేషియాలో 1 సెప్టెంబర్-30 అక్టోబర్ 2021 మధ్య కరోనా కారణంగా 7636 మంది మరణించారు. వీరిలో 2159 రెండు డోసులు వేసి 14 రోజులైంది.

China Vaccine: ప్రాణాలు తీస్తున్న చైనా వ్యాక్సిన్.. రెండు డోసుల తర్వాతా కరోనా సోకి ఎంతమంది మరణించారంటే..
China Vaccine
Follow us
KVD Varma

|

Updated on: Nov 12, 2021 | 12:55 PM

China Vaccine: మలేషియాలో 1 సెప్టెంబర్-30 అక్టోబర్ 2021 మధ్య కరోనా కారణంగా 7636 మంది మరణించారు. వీరిలో 2159 రెండు డోసులు వేసి 14 రోజులైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ 1573 మందిలో 72.8% మంది చైనాలో తయారైన సినోవాక్ వ్యాక్సిన్‌ను పొందినవారే. ఫైజర్ ఒకే మోతాదు తర్వాత, ఆస్ట్రాజెనెకా పూర్తి మోతాదు తర్వాత కరోనా నుండి 550 మరణాలు (25.5%) అదేవిధంగా వ్యాక్సిన్ తీసుకొని వారిలో కరోనా నుండి 36 మరణాలు (1.7%) సంభవించాయి. మలేసియా మొత్తం జనాభా సుమారు 30 మిలియన్లు.

113 దేశాలకు చైనా వ్యాక్సిన్..

ఆస్ట్రాజెనెకా ఫార్ములా ఆధారంగా కోవిషీల్డ్ భారతదేశంలో ఉపయోగిస్తున్నారు. మలేషియాలో ప్రాణాలు కోల్పోయిన 7636 మంది రోగులలో 4076 మందికి వ్యాక్సిన్ రాలేదు. రెండవ డోస్ ఇంకా 1401లో ఇవ్వాల్సి ఉంది. రెండు మోతాదుల తర్వాత మరణించిన వారిలో 75% మంది 60 ఏళ్లు పైబడిన వారు. 94% ఒకటి కంటే ఎక్కువ వ్యాధులు ఉన్నవారు. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వయంగా ఈ గణాంకాలను ధృవీకరించింది. చైనా మొత్తం నాలుగు ప్రాంతాల (ఆసియా పసిఫిక్, యూరప్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా) 113 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించింది.

భారతదేశం టీకా సేఫ్; రెండు డోస్‌ల తర్వాత కేవలం 0.4% మంది మాత్రమే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఐసీఎంఆర్(ICMR) అధ్యయనం ప్రకారం, కరోనా సోకిన వారిలో 0.4% మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మరణించారు. 677 మంది కోవిడ్ పేషెంట్ల జీనోమ్‌ని సీక్వెన్స్ చేయడం ద్వారా ఈ నిర్ధారణకు వచ్చారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా, 10 శాతం మంది ప్రజలు ఆసుపత్రిలో చేరవలసి వచ్చింది. ఈ రోగులలో 86 శాతం మందిలో డెల్టా వేరియంట్ కనిపించింది.

సినోవాక్ 43 దేశాలకు 76 కోట్ల డోస్ ఇచ్చింది

  • చైనా ప్రధాన కరోనా వ్యాక్సిన్ తయారీదారులలో సినోఫార్మా అలాగే, సినోవాక్ ఉన్నాయి.
  • వ్యాక్సిన్ అమ్మకంలో సినోవాక్ ముందుంది. 43 దేశాలకు 76 కోట్ల డోస్‌లు ఇచ్చారు.
  • వ్యాక్సిన్ డొనేషన్‌లో సినోఫార్మా ముందుంది. 76 దేశాలకు వ్యాక్సిన్‌లను పంపించారు.
  • సినోవాక్ విక్రయించిన 76 కోట్ల డోస్‌లలో అత్యధికంగా 39.45 కోట్ల డోస్‌లు ఆసియా పసిఫిక్ ప్రాంతానికి అందించింది.
  • చైనా నుండి వ్యాక్సిన్ పొందడంలో లాటిన్ అమెరికా (23.01 మిలియన్లు) రెండవ స్థానంలో, యూరప్ (10.72 మిలియన్లు) మూడవ స్థానంలో, ఆఫ్రికా (2.87 మిలియన్లు) నాల్గవ స్థానంలో ఉన్నాయి.

జూన్‌లో సినోవాక్‌ను WHO ఆమోదించింది

మలేషియాలో, రెండు మోతాదుల తర్వాత కూడా వ్యాధి సోకిన 1,00,000 మందిలో 10.11 శాతం మందికి సినోవాక్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఫైజర్ విషయంలో, ఇది 3.47 శాతం వద్ద ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీని వెనుక ఖచ్చితమైన కారణం లేదు. సినోవాక్ ఎక్కువ జనాభాకు ఇచ్చారనీ, ఇది మొదటి నుండి వినియోగంలో ఉందనీ, అందుకే దాని కేసులు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. జూన్ 1, 2021న అత్యవసర ఉపయోగం కోసం WHO సినోవాక్ వ్యాక్సిన్‌ను ఆమోదించిందని చెప్పడం గమనార్హం.

మలేషియా 7 నెలల్లో జనాభాలో 55% కంటే ఎక్కువ మందికి రెండు మోతాదులను అందించింది

మలేషియాలో, టీకాలు వేయడం 24 ఫిబ్రవరి 2021 నుండి ప్రారంభమైంది. 17 సెప్టెంబర్ 2021 నాటికి, జనాభాలో 55.5% మందికి రెండు మోతాదులు ఇచ్చారు. జనాభాలో 66.6% మందికి మొదటి డోసు పూర్తయింది. ఫైజర్, ఆస్ట్రాజెనెకా, సినోవాక్ నుండి వ్యాక్సిన్‌లు ఇక్కడ అందచేశారు. వీటిలో తొలిదశలో సినోవాక్ ఇవ్వడం జరిగింది. ఇదే అత్యధిక మోతాదు కూడా.

భారతదేశంలో 110 కోట్లకు పైగా డోసులు ఇప్పటివరకూ ఇచ్చారు. వీటిలో 74.81 కోట్ల సింగిల్, 35.96 కోట్ల డబుల్ డోస్‌లు ఉన్నాయి. టీకాలు వేసిన వారిలో 49.41 కోట్ల మంది 18-44 ఏళ్ల మధ్య వయస్కులు కాగా, 31.60 కోట్ల మంది 45 ఏళ్లు పైబడిన వారు. గురువారం (నవంబర్ 11న), దేశంలో 38 లక్షలకు పైగా డోస్‌లు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి: Food: మనం లొట్టలేసుకుంటూ తినే సమోసా.. ఇష్టంగా తాగే టీ మన ఫుడ్ కాదు తెలుసా? మన ఆహారంగా స్థిరపడిపోయిన విదేశీ ఆహారాలు ఇవే!

Hepatitis: డెంగ్యూతో బాధపడుతున్న వారికి కామెర్లు కూడా సోకే అవకాశం.. లక్షణాలు తెలుసుకుని జాగ్రత్త పడాలి!

U&I Neckband Earphones: తక్కువ ధర.. ఎక్కువ ఫీచర్లు.. చాలా బ్యాటరీ బ్యాకప్ ..యూ అండ్ ఐ స్మార్ట్ నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్స్!