Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Purchase: బంగారం కొంటున్నారా? మీరు కొంటున్న పసిడి నిజమైనదో నకిలీదో సులువుగా గుర్తించండి ఇలా!

వివాహాలు ప్రారంభం కాగానే వధూవరులు బంగారు ఆభరణాల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. మరోపక్క బంగారం ధరలు కూడా పైపైకి ఎగసి పడుతున్నాయి. ఎప్పుడైనా బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

Gold Purchase: బంగారం కొంటున్నారా? మీరు కొంటున్న పసిడి నిజమైనదో నకిలీదో సులువుగా గుర్తించండి ఇలా!
Gold Jewellery
Follow us
KVD Varma

|

Updated on: Nov 12, 2021 | 1:58 PM

Gold Purchase: పెళ్లిళ్ల సీజన్ జోరుగా సాగుతోంది. నవంబర్ 15న దేవోత్థాన ఏకాదశి నుంచి మరిన్ని ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. నవంబర్ 19, డిసెంబర్ 14 మధ్య 12 రోజులు వివాహాలకు అనుకూలమైన సమయాలు. వివాహాలు ప్రారంభం కాగానే వధూవరులు బంగారు ఆభరణాల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. మరోపక్క బంగారం ధరలు కూడా పైపైకి ఎగసి పడుతున్నాయి. ఎప్పుడైనా బంగారం కొనేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మార్కెట్లోకి నకిలీ బంగారం వస్తోంది. బంగారం నిజమో, నకిలీదో గుర్తించడానికి చాలా సులభమైన మార్గం ఉంది. నకిలీ బంగారాన్ని గుర్తించడానికి కొన్ని సులభమైన చిట్కాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. జూన్ 1 నుంచి హాల్‌మార్క్ బంగారం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. హాల్‌మార్క్‌ల ద్వారా నిజమైన బంగారం సులభంగా గుర్తించవచ్చు. కాబట్టి హాల్‌మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనండి. మీరు కొన్న బంగారంపై హాల్ మార్క్ ఉన్నదీ లేనిదీ కచ్చితంగా పరిశీలించండి. తరువాతే బంగారం కొనుగోలు చేయండి.

2. అసలు హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క త్రిభుజాకార గుర్తును కలిగి ఉంటుంది. హాల్‌మార్కింగ్ సెంటర్ లోగోతో పాటు బంగారం స్వచ్ఛత కూడా రాసి ఉంటుంది.

3. నకిలీ బంగారం వెనిగర్‌తో కూడా గుర్తించవచ్చు. బంగారు ఆభరణాలపై కొన్ని చుక్కల వెనిగర్ వేయండి, రంగు మారకపోతే, అది నిజమైన బంగారంగా గుర్తించవచ్చు.

4. బంగారు ఆభరణాలను పిన్‌తో తేలికగా గీసుకోండి. తర్వాత ఆ స్క్రాచ్‌పై నైట్రిక్ యాసిడ్ చుక్క వేయండి. బంగారం నకిలీదైతే దాని రంగు వెంటనే ఆకుపచ్చగా మారుతుంది.

5. బంగారం చెమటతో తాకినప్పుడు నాణెం వంటి దుర్వాసన వస్తే, అది కల్తీ అని అర్థం. అసలు బంగారం ఎట్టి పరిస్థితిలోనూ వాసన రాదు.

6. ఒక కప్పు నీటిలో బంగారాన్ని ఉంచండి. నకిలీ బంగారం తేలికగా తేలుతుంది. నిజమైనది పూర్తిగా నీటిలో మునిగిపోతుంది.

7. బంగారం ఎల్లప్పుడూ విశ్వసనీయ దుకాణం నుండి కొనుగోలు చేయండి. ఎందుకం, మంచి దుకాణాలు బంగారం యొక్క వాస్తవికత గురించి అవసరమైన అన్ని పత్రాలను ఇస్తాయి.

8. అయస్కాంతం ద్వారా కూడా నకిలీ బంగారాన్ని గుర్తించవచ్చు. బంగారు ఆభరణాలపై అయస్కాంతం ఉంచండి, అది అంటుకుంటే, బంగారం నకిలీ కాదు, అది నిజమైనది.

9. మీరు కొన్న బంగారానికి సంబంధించి కచ్చితంగా బిల్లు తీసుకోండి. బిల్లులో మీరు కొన్న బంగారానికి సంబంధించిన అన్ని వివరాలనూ నమోదు చేసేలా దుకాణ దారుని కోరండి.

ఇవి కూడా చదవండి: China Vaccine: ప్రాణాలు తీస్తున్న చైనా వ్యాక్సిన్.. రెండు డోసుల తర్వాతా కరోనా సోకి ఎంతమంది మరణించారంటే..

Syringe crisis: సిరెంజిల కొరత ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎందుకంటే..

Disney Plus Hotstar: భారత్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు భారీ షాక్.. ఏకంగా ఎంతమంది సబ్‌స్క్రయిబర్లను కోల్పోయిందంటే..