AP vs TS Politics: తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు ఇది మంచిది కాదు.. మంత్రి వెల్లంపల్లి సంచలన కామెంట్స్..
Andhra Pradesh vs Telangana: తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి..
Andhra Pradesh vs Telangana: తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పదే పదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కామెంట్స్ చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి గానీ, ఆ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కానీ ఏపీపై అవాకులు చవాకాలు మాట్లాడటం మంచిపద్ధతి కాదని అన్నారు. ఇలాంటి విధానాలు మానుకుంటే మంచిదని హితవుచెప్పారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకి ముని శాపం ఉందని, ఆయన నిజం మాట్లాడితె తల వెయ్యి ముక్కలవుతుందని సెటైర్లు వేశారు. ఇదే కామెంట్‌ను గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు మంత్రి వెల్లంపల్లి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడితారు.. అధికారంలో లేకపోతే మరోలా మాట్లాడుతాడని విమర్శలు గుప్పించారు. కుప్పం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయం అని మంత్రి వెల్లంపల్లి విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా, శనివారం నాడు శ్రీశైలం శ్రీబ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మల్లికార్జునుడి దయంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు.
Also read:
Relationship: వివాదాలు లేని జీవితం లేదు.. దంపతుల మధ్య గిల్లికజ్జాలు వస్తే ఇలా చేయండి..
Olive Oil Benefits: ఆలివ్ నూనె ఆరోగ్యానికి ఎందుకు మంచిదో తెలుసా ?… అసలు విషయాలు తెలుసుకోండి..
Bigg Boss : సన్నీకి కౌంటరిచ్చిన దీప్తి .. షణ్నూపై మరింత ప్రేమ పెరిగిందంటూ పోస్ట్..