AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss : సన్నీకి కౌంటరిచ్చిన దీప్తి .. షణ్నూపై మరింత ప్రేమ పెరిగిందంటూ పోస్ట్‌..

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో సన్నీ, షణ్ముఖ్‌లకు తీవ్ర వాగ్యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మొదట సిరి, సన్నీలు గొడవపడడం, ఆతర్వాత సిరికి సపోర్టుగా షణ్ముఖ్‌ మాట్లాడడంతో సన్నీ మరింత రెచ్చిపోయాడు..

Bigg Boss : సన్నీకి కౌంటరిచ్చిన దీప్తి .. షణ్నూపై మరింత ప్రేమ పెరిగిందంటూ పోస్ట్‌..
Follow us
Basha Shek

|

Updated on: Nov 13, 2021 | 1:09 PM

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో సన్నీ, షణ్ముఖ్‌లకు తీవ్ర వాగ్యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. మొదట సిరి, సన్నీలు గొడవపడడం, ఆతర్వాత సిరికి సపోర్టుగా షణ్ముఖ్‌ మాట్లాడడంతో సన్నీ మరింత రెచ్చిపోయాడు. ‘ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని గేమ్‌ ఆడొద్దు.. దమ్ముంటే నీ గేమ్‌ నువ్వు ఆడు’ అంటూ షణ్నూపై మండిపడ్డాడు. దీనికి షణ్నూ కూడా అదే స్థాయిలో బదులిచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలడంతో హౌస్‌లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. కాగా తాజాగా షణ్ముఖ్‌ గర్లఫ్రెండ్‌ దీప్తి సునయన ఈ గొడవపై స్పందించింది. షణ్నూకి సపోర్టు చేస్తూ సన్నీని ఏకిపారేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

షణ్నూ..ఎంతో మెచ్యూర్‌గా గేమ్‌ ఆడుతున్నాడు.. ఈ సందర్భంగా సన్నీని ఉద్దేశిస్తూ ‘ నువ్వు బెస్ట్‌ అనుకో తప్పులేదు. కానీ మిగతా వారిని ఎందుకు అలా వేరేలా చూస్తున్నారు? నీలా ఇంకొకరు ఉండలేరు. ఇంకొకరిలా నువ్వు ఉండలేవు. నువ్వు ఎలా ఉండాలో మిగతా వాళ్లుకూడా అలానే ఉండాల్సిన అవసరం లేదు. అప్పడం అయిపోతావ్‌ అనవసరం గానా? చేతగాని ఆటలు ఆడుతున్నాడా? ఫిజికల్‌గా గట్టిగా ఉండి బాగా అరిస్తే గేమ్‌ ఆడినట్లా? ఫిజికల్‌గా కన్నా కష్టమైన టాస్క్‌ మైండ్‌తో ఆడడం. అది షణ్నూ వంద శాతం చేస్తున్నాడు. బిగ్‌బాస్‌లో తనను చూశాక తన మీద ప్రేమ మరింత పెరిగింది. ఎంతో మెచ్యూర్‌గా గేమ్‌ ఆడుతున్నాడు. సపోర్ట్‌గా నిల్చుంటే ఆడవాళ్లని అడ్డుపెట్టుకొని గేమ్‌ ఆడినట్లా? మరి నీకు కాజల్‌, మానస్‌ సపోర్ట్‌ ఇచ్చారు కదా..అప్పుడేమైంది నీ గేమ్‌ ? షణ్నూను యూట్యూబ్‌ వరకే గుర్తుపెట్టుకోనా? ఈ స్టేజ్‌ వరకు వచ్చాడు అంటే అతను ఎంత కష్టపడి వచ్చాడో అర్థం చేసుకోవాలి. మీరు రా అంటేనే పడలేకపోయారు. మరి మీరు అన్ని మాటలు అంటే ఎలా? ‘ అని రాసుకొచ్చింది. ఇక చివరిగా షణ్నూను ట్యాగ్‌ చేస్తూ ..’తప్పు అయితే నేర్చుకుంటాం రా బై’ అని ఎంత బాగా చెప్పావ్‌ షణ్నూ..నిన్ను హత్తుకోవాలనుకుంది’ అని ప్రేమను ఒలకబోసింది దీప్తి.

Also Read:

Balakrishna NBK 107: ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ NBK107.. డైరెక్టర్ ఎవరంటే.

Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?

Kangana Ranaut: కంగనా రనౌత్ నుంచి పద్మ శ్రీ వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి శివసేన డిమాండ్

పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
పాన్ ఇండియా అయినా.. రీజినల్ అయినా.. సినిమాలో ఇది మాత్రం పక్క..
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
JEE విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. IITల్లో సీట్లు పెరుగుతున్నాయోచ్!
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
తిరుమలలోని వీఐపీ కాటేజీలో అనుకోని అతిథి.. పరుగులు తీసిన జనం..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
Video: ఇదెక్కడి టెస్ట్ మ్యాచ్ భయ్యా.. 10 ఓవర్లలోనే క్లోజ్..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
ఆ హాలీవుడ్ మూవీ సిరీస్‌లకు ముగింపు.. ఫీల్ అవుతున్న ఫ్యాన్స్‌..
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
నిరుద్యోగ యువతకు భలేఛాన్స్.. SRTRI ఉచితశిక్షణకు దరఖాస్తులు ఆహ్వనం
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
సర్వ రోగాలకు దివ్యౌషధం.. షుగర్ ముప్పు నుంచి అధిక బరువు దాకా ..
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
తరచూ ఉల‌వ‌ల‌ను తింటే ఇన్ని లాభాలా..? ఆరోగ్యం రేసుగుర్రమేనట..!
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
10thలో 557 మార్కులు.. కానీ ఫలితాలకు 5 రోజుల ముందే మృత్యుఒడికి..
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే
IPL: పెర్ఫ్యూమ్ షాపులో పని.. రోజుకు 35 డాలర్ల జీతం.. కట్‌చేస్తే