PM Narendra Modi: తెగ నచ్చేసింది.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చిన జ్ఞాపికకు ప్రధాని మోదీ ఫిదా..
PM Modi thanks Biren Kumar Basak: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేకమైన మధురానుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఈ సందర్భంగా
PM Modi thanks Biren Kumar Basak: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కొన్ని ప్రత్యేకమైన మధురానుభూతులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటారు. ఈ సందర్భంగా ఎన్నో ప్రత్యేక విషయాలను నెటిజన్లతో పంచుకొని.. నూతన ఉత్సహాన్ని నింపుతుంటారు. ఇటీవల (నవంబర్ 8న) రాష్ట్రపతి భవన్‌లో ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ వ్యక్తులు అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరై అవార్డు గ్రహీతలను అభినందించారు. అయితే.. పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత బీరేన్ కుమార్ బసక్ అందించిన జ్ఞాపికను.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. బెంగాల్ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, నేత కళాకారుడు బీరేన్ కుమార్ అందించిన జ్ఞాపికను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి.. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నేత కళాకారుడు బీరేన్ కుమార్ బసక్ తనకు ఓ ప్రత్యేకమైన బహుమతిని అందించారని.. దానిని తాను ఎంతగానో ఆదరిస్తున్నట్లు తెలిపారు.
పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా బీరేన్ కుమార్ బసక్.. ప్రధాని మోదీకి ఈ ప్రత్యేకమైన కండువను అందజేశారు. ఆ వస్త్రంపై ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాతున్నట్లు.. బీరేన్ కుమార్ డిజైన్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్ చేశారు. ”శ్రీ బీరెన్ కుమార్ బసక్ పశ్చిమ బెంగాల్‌లోని నదియాకు చెందినవారు. ఆయన ప్రసిద్ధ నేత కళాకారుడు, భారతదేశ చరిత్ర, విభిన్న సంస్కృతి అంశాలను తన చీరలో చిత్రీకరించారు. పద్మ అవార్డు గ్రహీతలతో తాను సంభాషించిన నేపథ్యంలో.. నేను ఎంతగానే ఆరాధించే ప్రత్యేక బహుమతిని ఆయన నాకు అందించారు” అంటూ ప్రధాని మోదీ ఓ ఫొటోను ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ ట్విట్..
Shri Biren Kumar Basak belongs to Nadia in West Bengal. He is a reputed weaver, who depicts different aspects of Indian history and culture in his Sarees. During the interaction with the Padma Awardees, he presented something to me which I greatly cherish. pic.twitter.com/qPcf5CvtCA
— Narendra Modi (@narendramodi) November 13, 2021
ఈ సంవత్సరం పద్మ అవార్డులు పొందిన 119 మంది వ్యక్తులలో బీరెన్ కుమార్ బసక్ ఉన్నారు. పశ్చి మబెంగాల్ రాష్ట్రానికి చెందిన బసక్.. 1970లలో కేవలం ఒక రూపాయితో తన వృత్తిని ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి ఆయన కష్టపడి ఉన్నత స్థానానికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన వార్షిక టర్నోవర్ రూ.25 కోట్లు. బసక్ కస్టమర్లుగా చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఆశా భోంస్లే, లతా మంగేష్కర్ ప్రముఖలు ఉన్నారు.
Also Read: