Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Air Pollution: ‘రెండ్రోజులు లాక్‌డౌన్‌.. !’.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

దేశ రాజధాని ఢిల్లీపై కాలుష్యం కోరలు చాచింది. రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. డేంజర్‌ లెవెల్స్‌ దాటి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది

Delhi Air Pollution: 'రెండ్రోజులు లాక్‌డౌన్‌.. !'.. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Delhi Pollution
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 13, 2021 | 4:00 PM

దేశ రాజధాని ఢిల్లీపై కాలుష్యం కోరలు చాచింది. రోజురోజుకూ గణనీయంగా పెరిగిపోతోంది. డేంజర్‌ లెవెల్స్‌ దాటి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఈ నేపధ్యంలో ఢిల్లీలో ఎయిర్‌ పొల్యూషన్‌పై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపింది సుప్రీంకోర్ట్‌. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. వాయు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ. పంటల దగ్ధాన్ని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ను ప్రశ్నించారు. రెండు, మూడు రోజుల్లో కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే రెండ్రోజులు లాక్‌డౌన్‌ అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

వాయు కాలుష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని..ఇళ్లలో కూడా మాస్కులు ధరించాల్సి వస్తోందని పేర్కొన్నారు సీజేఐ. 5వందలుగా ఉన్న ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ను కనీసం 2వందలకు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే పంజాబ్‌, హర్యానా ప్రభుత్వాలు అత్యవసర సమావేశాలు ఏర్పాటుచేసి..పంటల దగ్ధాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలన్నారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టాప్‌ టెన్‌ పొల్యూషన్‌ సిటీస్‌లో ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది ఢిల్లీ. ఇక కోల్‌కతా ఫోర్త్‌ ప్లేస్‌, ముంబై సిక్స్త్‌ ప్లేస్‌లో ఉంది. ఐతే మన పొరుగు దేశం పాకిస్తాన్‌లోని లాహోర్‌ సెకండ్‌ ప్లేస్‌లో ఉండగా..చైనాలోని చెంగ్డూ నగరం 8వ స్థానంలో ఉంది.

Also Read: ఏపీకి మరో తుఫాన్ ముప్పు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

అదిరిపోయిన అయ్యగారి అభిమాని డ్యాన్స్.. కింగ్ సాంగ్‌కు ఊరమాస్ స్టెప్పులు