Railway News: దేశంలో మరో ప్రధాన రైల్వే స్టేషన్ పేరు మారనుందా? తెరమీదకు కొత్త ప్రతిపాదన
Indian Railways: దేశంలో మరో ముఖ్య రైల్వే స్టేషన్ పేరు మారే అవకాశముంది. ఆ మేరకు కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.
Indian Railways: దేశంలో మరో ముఖ్య రైల్వే స్టేషన్ పేరు మారే అవకాశముంది. ఆ మేరకు కొత్త ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. మధ్యప్రదేశ్ రాజధాని నగరం భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ ((Habibganj Railway Station) పేరు మార్చాలంటూ శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ రైల్వే స్టేషన్‌కు 18వ శతాబ్ధకాలంనాటి గిరిజన రాణి- రాణి కమలాపతి (Rani Kamlapati) పేరు పెట్టాలని సూచించింది. ఆ మేరకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపింది.
హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రూ.100 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయి పునరుద్ధరణ పనులు చేపట్టగా.. దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 15న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రైల్వే స్టేషన్ పేరు మార్చాలని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గోండు తెగకు చెందిన రాణి కమలాపతి పేరును ఈ రైల్వే స్టేషన్‌కు ఎందుకు పెట్టాలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోం శాఖ కార్యదర్శికి పంపిన లేఖలో వివరించింది.
కేంద్ర హోం శాఖకు మ.ప్రదేశ్ ప్రభుత్వం పంపిన లేఖ..
Madhya Pradesh govt writes to Centre to rename Bhopal’s Habibganj railway station after the tribal queen, Rani Kamlapati pic.twitter.com/b2Q0EUICgX
— ANI (@ANI) November 13, 2021
పునరుద్ధరణ పనులు చేపట్టిన హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
Bhopal’s revamped Habibganj Railway Station. PM Shri Narendra Modi will inaugurate it on Monday.@PIB_India @MIB_India @RailMinIndia @JansamparkMP pic.twitter.com/ZwNABRISlY
— PIB in MP (@PIBBhopal) November 13, 2021
ఇటీవల కాలంలో పలు రైల్వే స్టేషన్ల పేర్లను మార్చడం తెలిసిందే. అలహాబాద్ రైల్వే స్టేషన్ పేరును ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చగా.. ముఘల్‌సరయ్ రైల్వే జంక్షన్ పేరును పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్చడం తెలిసిందే. అలాగే ఫైజాబాద్ జంక్షన్ పేరును అయోధ్య కంటోన్మెంట్‌గా పేరు మార్చారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు కేంద్ర హోం శాఖ ఆమోదిస్తే.. త్వరలోనే భోపాల్‌లోని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ పేరును రాణి కమలాపతిగా త్వరలోనే మార్చే అవకాశమున్నట్లు సమాచారం.
Also Read..