Allu Arjun Pushpa: ఆలస్యంగా రానున్న పుష్పరాజ్‌.. బాక్సాఫీస్‌ ముందు పోటీ తప్పేలా లేదే..

Allu Arjun Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్‌ తొలి పాన్‌..

Allu Arjun Pushpa: ఆలస్యంగా రానున్న పుష్పరాజ్‌.. బాక్సాఫీస్‌ ముందు పోటీ తప్పేలా లేదే..
Pushpa Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 13, 2021 | 3:20 PM

Allu Arjun Pushpa: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. అల్లు అర్జున్‌ తొలి పాన్‌ ఇండియా చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఇక ఈ సినిమాలో బన్నీకి జోడిగా రష్మిక నటిస్తోంది. నిజానికి ఈ సినిమాను తొలుత ఒకే పార్ట్‌గా విడుదల చేద్దామనుకున్నారు. కానీ కథ నిడివి పెరగడంతో రెండు పార్టులుగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో పాత్రను చిత్ర యూనిట్ పరిచయం చేస్తోంది. సినిమాలోని పాత్రలన్నీ డీగ్లామర్‌ రోల్‌లో అత్యంత సహజంగా కనిపిస్తుండడంతో సుకుమార్‌ మార్క్‌ కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే ‘పుష్ప ది రైజ్‌’ పేరుతో తొలి పార్ట్‌ను డిసెంబర్‌ 17న విడుదల చేయడానికి చిత్రయూనిట్‌ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా వారం రోజుల పాటు వాయిదా పడుతూ.. డిసెంబర్‌ 25కు పోస్ట్‌పోన్డ్‌ అయ్యిందని తెలుస్తోంది. సినిమా షూటింగ్‌ ఆలస్యం కావడంతోనే చిత్ర యూనిట్‌ వారం రోజులు పొడిగించినట్లు సమాచారం. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర చర్చ తెరపైకి వచ్చింది. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘శ్యామ్‌సింగ రాయ్‌’ని డిసెంబర్‌ 24న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

Bunny And Nani

 

దీంతో నాని, బన్నీల మధ్య పోటీ ఉండనుందా అన్న చర్చ జరుగుతోంది. ఇలా నాని, బన్నీ ఇద్దరూ బాక్సాఫీస్‌ వార్‌కు సిద్ధమవడం ఇదే తొలిసారి అని చెప్పాలి. మరి రెండు భారీ చిత్రాలను ఒక రోజు వ్యవధిలో విడుదల చేస్తారా.? లేదా బన్నీ ముందు చెప్పిన తేదీకే వస్తాడా.? తెలియాలంటే పుష్ప రిలిజింగ్ డేట్‌ అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Padma Shri: అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

PM Narendra Modi: తెగ నచ్చేసింది.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చిన జ్ఞాపికకు ప్రధాని మోదీ ఫిదా..

PM Narendra Modi: తెగ నచ్చేసింది.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చిన జ్ఞాపికకు ప్రధాని మోదీ ఫిదా..