Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padma Shri: అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

Kangana Ranaut: 1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది.

Padma Shri: అది నిరూపిస్తే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు
Kangana
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 13, 2021 | 2:08 PM

Kangana Ranaut: 1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతూనే ఉంది. 1947లో దేశానికి వచ్చిన స్వాతంత్రం ఓ భిక్షగా పేర్కొన్న కంగనా రనౌత్.. దేశానికి నిజమైన స్వాతంత్రం నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయిన 2014లోనే వచ్చిందంటూ  ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.  స్వాతంత్ర ఉద్యమాన్ని, స్వాతంత్ర పోరాట వీరులను కంగనా రనౌత్ తన వ్యాఖ్యలతో అవమానించారంటూ పలు వర్గాల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆమెకు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని శివసేన, కాంగ్రెస్, వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.

తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్‌పై కంగనా స్పందించారు. స్వాతంత్రం గురించి తాను చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని నిరూపిస్తే పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసేందుకు సిద్ధమని చెప్పారు. టీవీ ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. 1857లో స్వాతంత్రం కోసం తొలి పోరు జరిగిందన్నారు. అలాగే దేశ స్వాతంత్రం కోసం సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయ్, వీర్ సావర్కర్ తదితరుల పోరాటాలు చేశారని గుర్తుచేశారు. 1857 పోరాటం గురించి తనకు తెలుసని.. అయితే 1947లో దేశ స్వాతంత్రం కోసం ఎలాంటి పోరాటాలు జరిగినట్లు తనకు తెలీదని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఎవరైనా తనకు అవగాహన కల్పిస్తే.. పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేసి.. క్షమాపణ చెప్పేందుకు సిద్ధమన్నారు.

Also Read..

Kangana Ranaut: కంగనా రనౌత్ నుంచి పద్మ శ్రీ వెనక్కి తీసుకోండి.. కేంద్రానికి శివసేన డిమాండ్

Anantapur district: గొప్ప ఘనకార్యమే చేశారు.. అడ్డంగా బుక్కయ్యారు.. గవ్వలతో

PM Narendra Modi: తెగ నచ్చేసింది.. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇచ్చిన జ్ఞాపికకు ప్రధాని మోదీ ఫిదా..