Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్క్ చాటున దాగిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? బాలీవుడ్‏ను కుదిపేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరు..

మాస్క్ చాటున దాగిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? బాలీవుడ్‏ను కుదిపేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరు..

మాస్క్ చాటున దాగిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? బాలీవుడ్‏ను కుదిపేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరు..
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 13, 2021 | 2:20 PM

కరోనా సంక్షోభంతో మాస్క్ ప్రతి ఒక్కరి జీవితంలో ఓ భాగమైంది.. బయటకు వెళ్లినప్పుడు క్షణం కూడా మాస్క్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే మాస్క్ ధరించడంతో.. తెలిసిన వ్యక్తులు ఎదురుగా ఉన్నా.. గుర్తుపట్టలేకపోతున్నారు. సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు.. మాస్క్ ధరించి బయటకు రావడం ఎవరనేది గుర్తించడం కాస్త కష్టమే అవుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ మాస్క్ ధరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… పైన ఫోటోలో మాస్క్ చాటున దాగున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Actress 1

ఒకప్పుడు బాలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేసిన ఈ హీరోయిన్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. తన అందం.. అభినయంతో సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. దాదాపు స్టార్ హీరోస్ అందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం సినిమాల్లోనే కాకుండా.. సమాజంలో జరుగుతున్న ఘటనలు.. ప్రస్తుత పరిస్థితులపై తనదైన శైలీలో స్పందిస్తుంది ఈ అమ్మడు..

Actress 3 ఈరోజు ఈ హీరోయిన్ పుట్టినరోజు.. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ నటికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం హిందీలోనే కాదు.. తెలుగు, పంజాబీ, మలయాళం, కన్నడ, తమిళ్, బెంగాలీ భాషల్లో నటించి అగ్రకథానాయికగా సుధీర్ఘ కాలం కొనసాగారు. గుర్తుపట్టారా ?

Actress 4

ఓవైపు స్టార్ హీరోయిన్‏గా రాణిస్తూనే మరోవైపు.. కామెడీ చిత్రాల్లోనూ నటించి మెప్పించింది ఈ నటి. అలాగే.. బుల్లితెరపైన కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఈమె కోల్ కత్తా నైట్ రైడర్స్ టీంకు సహ యజమానిగా వ్యవహరిస్తున్నారు.

Actress 5

అలాగే ఈ హీరోయిన్ ప్రస్తుతం డ్రీమ్ట్ అన్ లిమిటెడ్ సినీ నిర్మాణ సంస్థలో కో ఓనర్‏గా వ్యవహరిస్తూ.. పలు చిత్రాలను నిర్మించారు. అలాగే సామాజిక సేవ చేస్తూ.. పలు చారిటీలను నిర్వహిస్తున్నారు. సామాజిక సేవ చేసినందుకు గానూ. ఈమెకు ఇందిరా గాంధీ మెమోరియల్ పురస్కారం అందుకున్నారు. ఇప్పటికైనా గుర్తుపట్టారా

Actress 2

పైన ఫోటోలలో ఉన్న హీరోయిన్… ఒకప్పుడు తన అందం, అభినయంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన జూహీ చావ్లా. 1986లో సుల్తానేట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా జూహీ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‏గా ఎదిగారు.

Juhi Chawla

1995లో జూహీ చావ్లా.. ప్రముఖ పారిశ్రామికవేత్త జయ్ మెహతాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈరోజు (నవంబర్ 13న) జూహీ చావ్లా పుట్టినరోజు. ఈ సందర్బంగా.. ఆమెకు సోషల్ మీడియాలో బర్త్ విషెస్ తెలుపుతున్నారు సినీ ప్రముఖులు.

View this post on Instagram

A post shared by Juhi Chawla (@iamjuhichawla)

Also Read: Bigg Boss : సన్నీకి కౌంటరిచ్చిన దీప్తి .. షణ్నూపై మరింత ప్రేమ పెరిగిందంటూ పోస్ట్‌..

Balakrishna NBK 107: ఘనంగా ప్రారంభమైన బాలకృష్ణ NBK107.. డైరెక్టర్ ఎవరంటే.

Samantha: ఇతరులు చేసిన పని నువ్వు కూడా చేయాలని లేదు.. సమంత చేసిన పోస్ట్‏కు అర్థమేంటో ?