Samantha: మంచి వ్యక్తికి వంద రెట్లు ఎక్కువ.. అతనిని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను.. సమంత పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉంటోంది. గతేడాది మయోసైటిక్ కారణంగా కెమెరాకు దూరంగా ఉన్న ఈ అందాల తార.. కోలుకున్నాక జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం రిలీజ్ కాగా..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీబిజీగా ఉంటోంది. గతేడాది మయోసైటిక్ కారణంగా కెమెరాకు దూరంగా ఉన్న ఈ అందాల తార.. కోలుకున్నాక జెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన శాకుంతలం రిలీజ్ కాగా..త్వరలోనే విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటించిన సిటడెల్ వెబ్ సిరీస్ కూడా అతి త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా సినిమా షూటింగులతో బిజీబిజీగా ఉండే సామ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్‌తో పాటు తన పర్సనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంది. అలా తాజాగా తన క్లోజ్ ఫ్రెండ్ రాహుల్ రవీంద్రన్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. రాహుల్ టేస్టీ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న పిక్ షేర్ చేస్తూ.. ‘మీకు తెలిసిన ఓ మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు మల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను. అతను మంచి ఫుడీ అయినప్పటికీ మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు. కానీ ఎంత బాధపడతాడో’ అని ఫన్నీగా రాసుకొచ్చింది సమంత.
ఇక సమంత పోస్టుకు రాహుల్ కూడా స్పందించాడు. ‘ఏంటి.. ఇప్పుడు నన్ను ఏడిపించాలని చూస్తున్నావా? లవ్యూ లాడ్స్’ అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా తమ కెరీర్ ప్రారంభంలో ఓ మూవీలో హీరో, హీరోయిన్లుగా నటించారు రాహుల్, సమంత. ఆతర్వాత వీరిద్దరూ మంచి స్నేహితులిగా మారిపోయారు. ఇక రాహుల్ సతీమణి చిన్నయి కూడా సామ్ కు క్లోజ్ ఫ్రెండ్. సామ్ నటించిన పలు సినిమాలకు చిన్మయినే డబ్బింగ్ చెప్పింది.




View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




