Samantha: ఒత్తిడికి గురయ్యాను.. ఎవరి జీవితం పర్ఫెక్ట్ కాదు.. మరోసారి సమంత షాకింగ్ కామెంట్స్..
ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ తిరిగి తన కెరీర్ పై

ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం సామ్ తిరిగి తన కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే వరుస ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీ షెడ్యూల్ గడిపేస్తుంది. ఇటీవల అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్‌లో అదుర్స్ అనిపించింది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలలో సైతం పగా వేసేందుకు సిద్ధమైంది సామ్. అటు సినిమాలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది సామ్. తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ మాత్రమే కాకుండా మోటివేషన్ కోట్స్ షేర్ చేస్తూ వస్తుంది. ఇటీవల మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గోన్న సమంత… తన జీవితంలో ఎదుర్కోన్న మానసిక సంఘర్షణల గురించి బయటపెట్టింది.
ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. మనం ఒత్తిడితో కూడిన ప్రపంచంలో జీవిస్తున్నాం. సోషల్ మీడియాతో సహా ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ దృష్టి మనపై ఉండడం వలన మనల్ని ఆందోళనకు గురిచేసే అంశాలు, మన బలహీనతలు, బాధలు వంటి వాటి గురించి మాట్లాడడం ఇబ్బందిగా ఉంటుంది. పర్ఫెక్ట్ గా జీవించడమనేది ఈరోజుల్లో చాలా కష్టమైన పని. నన్ను నమ్మండి. ఎవరి జీవితమూ పర్ఫెక్ట్ గా లేదు. నేను చాలా ఒత్తిడిని ఎదుర్కోన్నాను.. కేవలం గ్లామర్ గురించి మాత్రమే కాదు.. మన జీవితాల్లోని బాధలు, ఇబ్బందికర పరిస్థితుల గురించి నాలాంటి వారు మాట్లాడితే అంగీకరిస్తారనే అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎత్తపల్లాలు ఉంటాయి. నేను మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోన్నాను. నా స్నేహితులు, కౌన్సిలర్స్, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలతో వాటి నుంచి బయటకు రాగలిగాను. అలాగే భవిష్యత్తులో నా జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి బలంగా ఉన్నాను. ఇందుకు నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నాకు తోడున్నారనే నమ్మకం. ఇబ్బందిపడే కన్నా.. మానసిక సమస్యలను ఇతరులతో పంచుకోవడమే ఉత్తమం అన్నారు సమంత. ప్రస్తుతం సామ్ యశోద సినిమా చేస్తుంది.
Also Read: Akhanda Movie: జై బాలయ్య ఫుల్ సాంగ్ వచ్చేసింది చూశారా.. రికార్డు వ్యూస్‌తో హల్చల్..
Rakul Preet Singh: ప్రేమలో మునిగి తేలుతున్న అందాల ముద్దుగుమ్మ.. క్లారిటీ ఇచ్చిన రకుల్ ప్రీత్..
Balakrishna: మంత్రి హరీష్ రావును కలిసిన బాలకృష్ణ.. ఏ అంశాలపై చర్చించారంటే..




