AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: అప్పుడు అమాయకంగా ఉన్నాను.. ఇప్పుడు సమస్యలను ఎదుర్కోవడం అలవాటైంది.. సమంత ఆసక్తికర కామెంట్స్..

శాకుంతలం కథ గురించి చిన్నప్పుడే తనకు తెలుసునని.. అన్నారు. అలాగే కెరీర్ మొదట్లో తాను చాలా అమాయకంగా ఉండేదానినని.. కానీ ఇప్పుడు సమస్యలను ఎదుర్కొవడం అలవాటు కావడంతో చాలా స్ట్రాంగ్ అయ్యానని అన్నారు. సమస్య వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ స్ట్రాంగ్ అవుతారని చెప్పుకొచ్చారు.

Samantha: అప్పుడు అమాయకంగా ఉన్నాను.. ఇప్పుడు సమస్యలను ఎదుర్కోవడం అలవాటైంది.. సమంత ఆసక్తికర కామెంట్స్..
Samantha
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2023 | 9:20 AM

Share

గత నెల రోజులుగా శాకుంతలం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు సమంత. శకుంతల.. దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోనూ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఇటీవల మీడియాతో ముచ్చటించిన సామ్.. సినిమాలు.. కెరీర్.. వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. శాకుంతలం సినిమా.. శకుంతల పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. శాకుంతలం కథ గురించి చిన్నప్పుడే తనకు తెలుసునని.. అన్నారు. అలాగే కెరీర్ మొదట్లో తాను చాలా అమాయకంగా ఉండేదానినని.. కానీ ఇప్పుడు సమస్యలను ఎదుర్కొవడం అలవాటు కావడంతో చాలా స్ట్రాంగ్ అయ్యానని అన్నారు. సమస్య వచ్చినప్పుడు ప్రతిఒక్కరూ స్ట్రాంగ్ అవుతారని చెప్పుకొచ్చారు.

సమంత మాట్లాడుతూ.. “కాళిదాసు రాసిన కావ్యంలోని కథ ఇది. ఇప్పటి అమ్మాయినైన నేను ఆ పాత్రతో రిలేట్ అవుతున్నానంటే.. ఆ పాత్ర ఎంత పవర్ ఫుల్ అనేది అర్తం చేసుకోవచ్చు. శకుంతల పాత్ర నేటి అమ్మాయిలకు కనెక్ట్ అవుతుంది. శకుంతల ఓటమిని అస్సలు ఒప్పుకోదు. నాకు తెలిసి తనే ఫస్ట్ సింగిలి మదర కావచ్చు. ఇప్పటి మహిళల్లో చాలా మందికి ఆమె పాత్ర కనెక్ట్ అవుతుంది. ” అన్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే తాను ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇస్తున్నానని.. శకుంతల రోల్.. నటిగా తనకు పెద్ద బాధ్యత అని.. అందులే ముందు చాలా భయపడ్డానని అన్నారు. అందుకే డైరెక్టర్ గుణశేఖర్ అడగ్గానే ముందు నో చెప్పానని.. అంతకు ముందే రాజీ పాత్ర చేసి వచ్చాను.. అందుకు భిన్నంగా శకుంతల పాత్లో చాలా అందంగా కనిపించాలి. ప్రతి ఫ్రేమ్ లో అందంతోపాటు.. పాత్రలో డిగ్నిటీ, గ్రేస్ కనిపించాలి అని అన్నారు. ఒకప్పుడు అమాయకంగా కనిపించిన సమంత.. ఇంత ధైర్యవంతురాలిగా ఎలా మారిందని ప్రశ్నించగా.. సామ్ స్పందిస్తూ.. “అప్పుడు నాకు ఇన్ని సమస్యలు లేవు.. అమాయకత్వంగా ఉన్నాను. అన్నీ ఉన్నాయనే సంతోషంలో ఉన్నాను.. అదే తెరపై కనపడేది. ఇప్పుడు అలా లేదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నాకు తెలియదు. ఈ ప్రయాణంలో నేను ఎదుర్కొన్న సమస్యల వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను.. అందుకే ఇలా మారిపోయాను. సమస్యలు వచ్చాయి.. ఎదుర్కొంటున్నాను.. అలవాటైపోయింది. సమస్యలు వచ్చినప్పుడు అందరూ మారతారు. నేనేమి స్పెషల్ కాదు.. అమాయకమైన సమంత ఇప్పుడు స్ట్రాంగ్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చింది.