AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!

Future Stars in Cricket: టీ20 ప్రపంచకప్ 2026 మొదలైంది. ఎందరో ఈ మెగా ఈవెంట్‌లో సందడి చేయబోతున్నారు. ముఖ్యంగా ఐదుగురు యంగ్ ప్లేయర్స్ మాత్రం తమదైన శైలిలో ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే దేశం తరపున రికార్డుల వర్షం కురిపించిన ఈ యంగ్ గన్స్.. ఐసీసీ మెగా ఈవెంట్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు.

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్.. సచిన్, లారాను మించిపోయేటోళ్లు భయ్యో..!
Abhishek Sharma, Dewald Brevis
Venkata Chari
|

Updated on: Feb 07, 2026 | 12:58 PM

Share

Future Stars in Cricket: 2026 టీ20 ప్రపంచ కప్ శనివారం నుంచి మొదలైంది. ప్రతీ ఎడిషన్ లాగే, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది యువ క్రికెటర్లు ఈ మెగా ఈవెంట్ లో సందడి చేస్తుంటారు. ఇందులో కొంతమంది మాత్రం అంచనాలకు భిన్నంగా ఆకట్టుకుంటుంటారు. అయితే, తమ తొలి టీ20 ప్రపంచ కప్ ఆడిన కొంతమంది ప్లేయర్లు తమదైన ముద్రతో ఇప్పటికే ఆకట్టుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ఐదుగురు ప్లేయర్లు చేరారు.

అభిషేక్ శర్మ: భారత జట్టు తరపున బరిలోకి దిగనున్న ఈ ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్.. గత 18 నెలలుగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. భారత జట్టు చివరిసారిగా టీ20 ప్రపంచ కప్‌ను గెలిచన వారం తర్వాత అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ.. పొట్టి ఫార్మాట్‌లో రికార్డుల విధ్వంసం చేస్తున్నాడు. ఇప్పటివరకు, అభిషేక్ 37 మ్యాచ్‌ల్లో ఆడి 1,297 పరుగులు బాదేశాడు. 194.74 స్ట్రైక్ రేట్‌తో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇప్పటికే రెండు టీ20ఐ సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టకు తుపాన్ ఆరంభాలను ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.

డెవాల్డ్ బ్రెవిస్: 2020 అండర్-19 ప్రపంచ కప్ సందర్భంగా డెవాల్డ్ బ్రెవిస్ కూడా తన చేతివాటం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘ది బేబీ ఏబీ’గా పేరుగాంచిన బ్రెవిస్.. కళ్లు చెదిరే షాట్లతో విమర్శకులను సైతం ఆకట్టుకుంటున్నాడు. అయితే ఐపీఎల్, దేశీయ క్రికెట్‌లో తడబడడంతో జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. 2025లో విజయవంతమైన తర్వాత, బ్రెవిస్ ఇప్పుడు దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో 3 ఫార్మాట్లలోనూ రెగ్యులర్ సభ్యుడిగా మారిపోయాడు. మిడిల్ ఓవర్లలో మ్యాచ్ గమనాన్ని మార్చే సామర్థ్యం ఉన్న బ్రెవిస్.. ముఖ్యంగా గతేడాది ఈ ఫార్మాట్‌లో 176.42 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ.. ప్రత్యర్ధులను చిత్తు చేస్తున్నాడు.

జాకబ్ బెథెల్: 2025 సెప్టెంబర్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించిన జాకబ్ బెథెల్ ఇప్పటికే టీ20ల్లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ అన్ని ఫార్మాట్లలో తన స్థానాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన యాషెస్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు.

కూపర్ కొన్నోల్లీ: బిగ్ బాష్ టీ20, అండర్-19 స్టార్ గా మారిన కూపర్ కొన్నోలీ.. తన పవర్ హిట్టింగ్, ఎడమచేతి వాటం స్పిన్ బౌలింగ్ తో ఆస్ట్రేలియా జట్టుకు ఎక్స్-ఫ్యాక్టర్ కావొచ్చు. ఇప్పటికే ఆస్ట్రేలియా తరపున 3 ఫార్మాట్లలోనూ డైనమిక్ ఆటగాడిగా మారిపోయాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో 5 వికెట్లు తీసిన అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియన్‌గా కొన్నోలీ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బిగ్ బాష్, షీల్డ్ క్రికెట్ ఫైనల్స్‌లో అద్భుత ప్రదర్శనలు ఇస్తూ.. తనను తాను బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా మార్చుకున్నాడు. తన నైపుణ్యాలను వెలికితీసి గణనీయమైన ముద్ర వేయడానికి ప్రపంచ కప్ అతనికి సరైన వేదిక కావొచ్చు.

కమిల్ మిషారా: శ్రీలంక క్రికెట్ ద్వారా ప్రపంచానికి పరిచమైన కమిల్ మిషారా.. అండర్-19 క్రికెట్ ద్వారా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం ఓపెనర్, వికెట్ కీపర్ మొదట శ్రీలంక స్కూల్ క్రికెట్‌లో 250 పరుగుల ఇన్నింగ్స్‌తో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత క్రమంగా ర్యాంకుల్లో సత్తా చూపిస్తూ క్రమంగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే శ్రీలంకకు వన్డేలు, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించిన మిషారా, పటిష్టమైన సాంకేతిక బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పటికే 3 టీ20ఐ హాఫ్ సెంచరీలతో మెరిసిన మిషారా.. టీ20 ప్రపంచ కప్‌పై ఫోకస్ పెంచాడు. శ్రీలంక టాప్ ఆర్డర్‌లో దీర్ఘకాలిక సభ్యుడిగా ఎదగడానికి స్వదేశీ పరిస్థితులు అతనికి గొప్ప అవకాశంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..
స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా