AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అదే పనిగా అరుస్తూ కనిపించిన గిన్ని కోళ్లు.. అక్కడ ఏముందా అని వెళ్లి చూడగా

మీ పొలంలో లేదా ఇంటి ఆవరణలో పాములు తిరుగుతున్నాయా? గిన్ని కోళ్లు పాములను ఎలా గుర్తిస్తాయి.. వాటిని ఎలా తరిమికొడతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. లేట్ ఎందుకు ఒకసారి చెక్ చేయండి.

Video: అదే పనిగా అరుస్తూ కనిపించిన గిన్ని కోళ్లు.. అక్కడ ఏముందా అని వెళ్లి చూడగా
Representative Image
Ravi Kiran
|

Updated on: Apr 30, 2026 | 12:37 PM

Share

రైతులకు పొలాల్లో, గడ్డి వాముల దగ్గర పాముల భయం ఎప్పుడూ ఉంటుంది. అయితే, ప్రకృతి మనకు కొన్ని సహజమైన రక్షణ కవచాలను ఇచ్చింది. అందులో గిన్ని కోళ్లు ఒకటి. గిన్ని కోళ్లకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అవి తమ పరిసరాల్లో ఏదైనా వింత ఆకారాన్ని లేదా పాములను చూసినప్పుడు చాలా విభిన్నంగా, గట్టిగా అరుస్తాయి. ఈ శబ్దాలను బట్టి రైతు తన గడ్డి వాము కింద, పశువుల పాక దగ్గర పాము ఉందని గుర్తించవచ్చు. ఇక పొలాల్లో ఎక్కువగా పెద్ద జెర్రిపోతులు ఉంటాయి. సాధారణంగా ఇవి విషపూరితమైనవి కాకపోయినా, ఎలుకల కోసం ఇవి గడ్డి వాముల్లో చేరుతుంటాయి.

గిన్ని కోళ్లు ఆ పామును వదలకుండా దాని చుట్టూ తిరుగుతూ, దాన్ని అక్కడి నుండి వెళ్ళిపోయేలా చేస్తాయి. పాము ఆకారం భారీగా ఉంటే.. ఇవి దాన్ని వేటాడనివ్వకుండా అడ్డుకుంటాయి. ఒకవేళ చిన్న ఆకారంలో ఉంటే మాత్రం దానిపై దాడి చేసి చంపగలవు. ఈ కోళ్లను పెంచడం వల్ల పాములే కాకుండా ఇతర కీటకాల బెడద కూడా తగ్గుతుందని రైతులు అంటుంటారు. ముఖ్యంగా పశువుల పాకలు లేదా గడ్డి వాములు ఉన్నవారు కనీసం రెండు జతల గిన్ని కోళ్లను పెంచుకుంటే పాముల భయం ఉండదని సలహా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సహజమైన పద్ధతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.

Also Read: కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

Follow Us