AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!

నైజీరియాలో ఒక భారీ కొండచిలువ పశువును మింగిందని భావించి గ్రామస్తులు దాన్ని చంపేశారు. కానీ దాని పొట్ట కోసి చూస్తే కనిపించిన దృశ్యం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి.

కడుపు ఉబ్బిపోయి కనిపించిన భారీ కొండచిలువ.. పట్టుకుని పొట్ట కోసి చూడగా.. ఆశ్చర్యం.!
Python
Ravi Kiran
|

Updated on: Apr 30, 2026 | 9:50 AM

Share

ప్రకృతిలో మనకు తెలియని వింతలు ఎన్నో జరుగుతుంటాయి. నైజీరియాలోని ఒక మారుమూల గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది జరిగి చాలా ఏళ్లు అయింది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఇదొక వైరల్ కంటెంట్. ఆ గ్రామ సమీపంలో తిరుగుతున్న ఒక అతి భారీ కొండచిలువను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ పాము పొట్ట విపరీతంగా ఉబ్బి ఉండటంతో, అది తమ పశువులలో దేనినో మింగేసి ఉంటుందని వారు భావించారు. తమ పశువులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరూ కలిసి ఆ భారీ పామును చంపేశారు.

అయితే, ఆ పాము నిజంగా దేన్ని మింగిందో తెలుసుకోవాలని స్థానికులు దాని పొట్టను కోసి చూశారు. లోపల ఏదైనా పశువు మృతదేహం ఉంటుందని ఆశించిన వారికి ఒక ఊహించని దృశ్యం కనిపించింది. ఆ పాము పొట్ట నిండా పదుల సంఖ్యలో గుడ్లు ఉన్నాయి. అవును, ఆ కొండచిలువ ఏదైనా జంతువును మింగడం వల్ల దాని పొట్ట ఉబ్బలేదు, అది వందకు పైగా గుడ్లకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉండటం వల్ల అలా కనిపించింది.

ఈ దృశ్యం చూసిన గ్రామస్తులు ఒక్కసారిగా విస్తుపోయారు. అనవసరంగా ఒక గర్భిణీ పామును చంపేశామని కొందరు బాధపడగా, మరికొందరు మాత్రం ఆ గుడ్లను చూసి సంతోషపడ్డారు. నైజీరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కొండచిలువ గుడ్లను ఎంతో ఇష్టంగా తింటారు. దీంతో ఆ గుడ్లన్నింటినీ గ్రామస్తులు పంచుకున్నారు. ఒకవేళ ఆ గుడ్లు పొదిగి ఉంటే, ఆ ప్రాంతంలో వందలాది కొత్త కొండచిలువలు వచ్చి ఉండేవని, వాటి వల్ల మనుషులకు, పశువులకు ప్రాణాపాయం ఉండేదని మరికొందరు అభిప్రాయపడ్డారు.

Also Read:  మీ దగ్గర రూ. 5 లక్షలు ఉంటే.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి.. నిద్రపోతున్నా డబ్బే డబ్బు.!

Follow Us