AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ దగ్గర రూ. 5 లక్షలు ఉంటే.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి.. నిద్రపోతున్నా డబ్బే డబ్బు.!

స్టాక్ మార్కెట్, గోల్డ్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్న సమయంలో మన పెట్టుబడిని ఎలా కాపాడుకోవాలి? బ్యాంక్ ఎఫ్డీల కంటే మెరుగైన రిటర్న్స్ ఇచ్చే బాండ్ల గురించి ఫైనాన్షియల్ ప్లానర్ చెప్పిన విషయాలు ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందామా. ఓ సారి ఆర్టికల్ చూసేయండి.

మీ దగ్గర రూ. 5 లక్షలు ఉంటే.. వీటిల్లో ఇన్వెస్ట్ చేసి వదిలేయండి.. నిద్రపోతున్నా డబ్బే డబ్బు.!
Money
Ravi Kiran
|

Updated on: Apr 30, 2026 | 8:15 AM

Share

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, యుద్ధ మేఘాలు, టెక్నాలజీలో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల స్టాక్ మార్కెట్, బంగారం లాంటి పెట్టుబడుల్లో విపరీతమైన ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత సమయంలో తమ కష్టార్జితాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియక సామాన్యులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ పలు కీలక సూచనలు ఇస్తున్నారు.

చాలామంది సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో ఉండే ఎఫ్డీలనే సురక్షితం అనుకుంటారు. కానీ అక్కడ కూడా మిస్-సెల్లింగ్ జరుగుతోందని హెచ్చరించారు. ఎఫ్డీలను ఉన్నపళంగా యూలిప్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్పించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే మధ్యతరగతి వారు తక్కువ కాలంలో డబ్బు డబుల్ అవుతుందనే ఆశతో మైక్రో ఫైనాన్స్, అనధికారిక చిట్టీల్లో పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారు. “ఎక్కడైతే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయో, అక్కడ రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

మార్కెట్ ఒడిదుడుకుల నుంచి తప్పుకుని స్థిరమైన రాబడిని కోరుకునే వారికి ‘డెట్ ఇన్స్ట్రుమెంట్స్’, ‘మున్సిపల్ బాండ్స్’ ఒక అద్భుతమైన ఆప్షన్. ప్రభుత్వం విడుదల చేసే బాండ్లతో పాటు రేటింగ్ బాగున్న కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడితే 9 శాతం నుంచి 11 శాతం వరకు స్థిరమైన వడ్డీ పొందవచ్చు. ఇది బ్యాంక్ ఎఫ్డీల కంటే మెరుగైన రిటర్న్. పన్ను ఆదా కోసం భార్య పేరు మీద లేదా తక్కువ ఆదాయం ఉన్న కుటుంబ సభ్యుల పేరు మీద ఈ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా 12 లక్షల వరకు ఎగ్జెంప్షన్ పొందే వీలుంటుందని వివరించారు. ఫోమోకి లోనవ్వకుండా, నిపుణుల సలహాతో నిర్ణయాలు తీసుకుంటేనే ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది.

Also Read: మీరు కరెంట్ బిల్లు కట్టలేదా? అయితే కనెక్షన్ కట్ చేసే అధికారం ఎవరికీ లేదు.! వివరాలు ఇవిగో

Follow Us