AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి ఊరేగింపులో భారీ శబ్దం.. కట్ చేస్తే.. 140 కోళ్లకు ఏమైందో చూస్తే షాక్..!

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఒక వింత, విషాదకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెళ్లి వేడుకల్లో సందడి చేసే DJ సంగీతం, ఒక పౌల్ట్రీ ఫారమ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. పెళ్లి ఊరేగింపులో మోగించిన మితిమీరిన శబ్దం కారణంగా ఏకంగా 140 కోళ్లు మృత్యువాత పడ్డాయి.

పెళ్లి ఊరేగింపులో భారీ శబ్దం.. కట్ చేస్తే.. 140 కోళ్లకు ఏమైందో చూస్తే షాక్..!
Dj Sound Effect Poultry Farm
Balaraju Goud
|

Updated on: Apr 30, 2026 | 12:41 PM

Share

ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఒక వింత, విషాదకర సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పెళ్లి వేడుకల్లో సందడి చేసే DJ సంగీతం, ఒక పౌల్ట్రీ ఫారమ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చింది. పెళ్లి ఊరేగింపులో మోగించిన మితిమీరిన శబ్దం కారణంగా ఏకంగా 140 కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ విషాద ఘటన సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

సుల్తాన్‌పూర్ జిల్లా కుడ్వార్ ప్రాంతంలోని రామ్ భద్ర పూర్వ గ్రామానికి చెందిన బబ్బన్ విశ్వకర్మ కుమార్తె వివాహం సందర్భంగా ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు గ్రామంలోని సబీర్ అలీకి చెందిన పౌల్ట్రీ ఫారమ్ ముందు నుండి వెళ్తున్న సమయంలో, DJ నుండి అత్యంత భారీ స్థాయిలో సంగీతం వినిపించింది. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఆ భీకర శబ్దానికి కోళ్లు విలవిలలాడిపోయాయి.

DJ సౌండ్ పెరగగానే ఫారమ్‌లోని కోళ్లు తీవ్ర భయాందోళనలకు గురయ్యాయని సబీర్ అలీ తెలిపారు. ఆ హై-డెసిబెల్ శబ్దాన్ని తట్టుకోలేక కోళ్లు ఒకదానిపై ఒకటి పడి ఊపిరాడక, మరికొన్ని గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాయని వివరించారు. యజమాని సబీర్ ఎంత వేడుకున్నా, ఊరేగింపులో ఉన్నవారు సంగీతాన్ని తగ్గించలేదని, పైగా తనపై దురుసుగా ప్రవర్తించారని అతను ఆరోపించాడు. మరుసటి రోజు ఉదయానికి 140 కోళ్లు చనిపోయి ఉండటం చూసి అతను షాక్‌కు గురయ్యాడు.

ఈ నష్టంపై సబీర్ అలీ స్థానిక పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. తన జీవనోపాధిని దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పశువైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోళ్లు చాలా సున్నితమైన జీవులని, హఠాత్తుగా వచ్చే భారీ శబ్దాల వల్ల అవి తీవ్రమైన ఒత్తిడికి (Stress) లోనై గుండెపోటుతో మరణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఘటన ధ్వని కాలుష్యం మూగజీవాలపై ఎంతటి ప్రమాదకర ప్రభావాన్ని చూపుతుందో మరోసారి నిరూపించింది. వేడుకల పేరుతో చేసే అతి, ఇతరుల ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలిగించకూడదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
తిరుగులేని శక్తిగా భారత్.. ప్రపంచ సవాళ్ల నడుమ టాప్ గేర్లలో జీడీపీ
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
అనుకోకుండా వచ్చే అతిథుల కోసం అద్భతమైన స్వీట్.. నోట్లే వేస్తే ..
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
ఫ్రీ బిర్యానీ కోసం ఎగబడ్డ జనం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..