AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rohit Sharma : క్యూ లైన్ లో నిలబడలేక బ్యాటింగ్ వదిలేశాడు.. బౌలర్ కావాలనుకుని బ్యాటర్ అయ్యాడు.. రోహిత్ సీక్రెట్స్ తెలుసా ?

Rohit Sharma : బ్యాటింగ్ క్యూ లైన్‌లో నిలబడలేక బౌలర్‌గా మొదలైన రోహిత్ శర్మ ప్రయాణం, నేడు ప్రపంచ స్థాయి ఓపెనర్‌గా ఎలా మారిందో ఈ కథ చెబుతోంది. చిన్న సంఘటన ఎలా గొప్ప కెరీర్‌కు దారి తీసిందో తెలుసుకుంటే ప్రతి క్రికెట్ అభిమానికి ఇది నిజమైన స్ఫూర్తి కథగా నిలుస్తుంది.

Rohit Sharma : క్యూ లైన్ లో నిలబడలేక బ్యాటింగ్ వదిలేశాడు.. బౌలర్ కావాలనుకుని బ్యాటర్ అయ్యాడు.. రోహిత్ సీక్రెట్స్ తెలుసా ?
Rohit Sharma
Rakesh
|

Updated on: Apr 30, 2026 | 12:39 PM

Share

Rohit Sharma : అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు, 20 వేలకు పైగా పరుగులు.. ఈ గణాంకాలు వింటేనే అర్థమైపోతుంది మన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సత్తా ఏంటో. కానీ ఈ రోజు ప్రపంచం మెచ్చిన ఓపెనర్‎గా వెలుగుతున్న రోహిత్, కెరీర్ ఆరంభంలో అసలు బ్యాటింగే వద్దనుకున్నాడన్న నిజం చాలామందికి తెలియదు. 30 ఏప్రిల్ 2026న 39వ వసంతంలోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది. క్యూ లైన్‌లో నిలబడలేక బ్యాటింగ్ వదిలేసిన వాడు, ఇవాళ క్రికెట్ ప్రపంచానికే లైన్ లీడర్ అయ్యాడు.

రోహిత్ శర్మ స్వయంగా పలు ఇంటర్వ్యూలలో తన కెరీర్ మొదలైన వింత పరిస్థితిని వివరించారు. ఆయన క్రికెట్ సెలక్షన్లకు వెళ్ళినప్పుడు, అక్కడ బ్యాటింగ్ కోసం చాలా పొడవైన క్యూ లైన్ ఉందట. రోజంతా ఎండలో నిలబడి తన వంతు కోసం వేచి చూడటం రోహిత్ కు అస్సలు ఇష్టం లేకపోయింది. అంతసేపు ఎవరు నిలబడతారు బాబూ అని అనుకుని, పక్కనే తక్కువ మంది ఉన్న బౌలింగ్ లైన్ లోకి వెళ్లి నిలబడ్డారట. అలా రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం ఒక ఆఫ్ స్పిన్నర్ గా మొదలైంది.

ఆ సెలక్షన్లలో బౌలర్ గా ఎంపికైన రోహిత్, ఒక టోర్నమెంట్ మొత్తం బౌలర్ గానే ఆడాడు. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ బౌలింగ్ చూసిన కోచ్ దినేష్ లాడ్ ఆశ్చర్యపోయారు. రోహిత్ లోని టాలెంటును గుర్తించి, తన స్కూల్ తరఫున ఆడాలని ఆహ్వానించారు. అప్పుడు కూడా రోహిత్ ప్రధానంగా బౌలర్ గానే జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఒకసారి తన స్కూల్ కు బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్ అవసరం పడింది. ఆ సమయంలో రోహిత్ కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది.

స్కూల్ టీమ్ కోసం ఆల్ రౌండర్ గా బరిలోకి దిగిన రోహిత్, ఓపెనర్ గా వెళ్లే ఛాన్స్ దక్కించుకున్నాడు. అక్కడ కొన్ని పరుగులు చేయగానే రోహిత్ లోని అసలైన బ్యాటర్ ప్రపంచానికి తెలిశాడు. అప్పటి వరకు బంతిని తిప్పాలనుకున్న వాడు, బంతిని బాదడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అంతా చరిత్రే. మిడిల్ ఆర్డర్ లో కెరీర్ మొదలుపెట్టి, ఎంఎస్ ధోనీ నిర్ణయంతో ఓపెనర్ గా మారి.. మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా, భారత జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎదిగిన తీరు అద్భుతం.

30 ఏప్రిల్ 2026 నాటికి రోహిత్ శర్మకు 39 ఏళ్లు నిండాయి. వయసు పెరుగుతున్నా తనలోని ఆట మాత్రం తగ్గలేదు. ఇప్పుడు ప్రతి ఐపీఎల్ మ్యాచ్ లేదా ఇంటర్నేషనల్ మ్యాచ్ లో బ్యాటింగ్ లైన్ రోహిత్ తోనే మొదలవుతుంది. ఆనాడు క్యూ లైన్ చూసి భయపడిన పిల్లాడు, నేడు భారత క్రికెట్ కు దిక్సూచిగా మారడం ఒక స్ఫూర్తిదాయక ప్రయాణం.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us